ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘర్షణకు దారితీసిన పంచాయతీ భవన ప్రారంభోత్సవం

ABN, Publish Date - Jan 31 , 2024 | 11:57 PM

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో పంచాయతీ కార్యాలయ భవన ప్రారంభోత్సవం ఘర్షణకు దారితీసింది.

కాంగ్రెస్‌ నాయకులు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే భగత్‌

నిడమనూరు, జనవరి 31 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో పంచాయతీ కార్యాలయ భవన ప్రారంభోత్సవం ఘర్షణకు దారితీసింది. బీఆర్‌ఎ్‌సకు చెందిన సర్పంచ ఏర్పాట్లు చేయగా, ఎమ్మెల్యేను పిలవకుండా ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకుని, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఇరువర్గాలు ఈ ఘర్షణపై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. గ్రామంలో అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిడమనూరు మండలం తుమ్మడం శివారులో ఉన్న పార్వతీపురాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటుచేయడంతో వంకా బ్రహ్మన్న పంచాయతీ మొదటి సర్పంచ్‌గా కాంగ్రెస్‌ తరపున గెలిచారు. కొన్నాళ్ల తర్వాత ఆయన బీఆర్‌ఎ్‌సలో చేరారు. పంచాయతీ భవనం కోసం ప్రభుత్వం రూ.20 లక్షల ఈజీఎస్‌ నిధులు మంజూరు చేయగా భవనం నిర్మించారు. నిర్మాణం పనులు ఇంకా పూర్తికాలేదు. భవనాన్ని పంచాయతీరాజ్‌ శాఖకు కూడా అప్పగించలేదు. కానీ సర్పంచ్‌ పదవీకాలం ముగుస్తుండటంతో నూతన భవనాన్ని ప్రారంభించేందుకు సర్పంచ్‌ బ్రహ్మన్న ఏర్పాట్లుచేశారు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు గాని, సంబంధిత అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భవనాన్ని ప్రారంభించేందుకు శిలాఫలకం ఏర్పాటుచేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడకు చేరుకుని స్థానిక ఎమ్మెల్యేను పిలవకుండా భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని, ప్రోటోకాల్‌ పాటించరా అంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల నడుమ కొంతసేపు ఘర్షణ జరిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు శిలాఫలకాన్ని ధ్వంసంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడినుంచి పంపించారు. సమాచారం తెలియడంతో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ బీఆర్‌ఎస్‌ నాయకులతో గ్రామాన్ని సందర్శించి కాంగ్రెస్‌ కార్యకర్తలు ధ్వంసం చేసిన పంచాయతీ శిలాఫలకాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకుల చర్యను ఖండించారు. అభివృద్ధిలో పోటీపడాలి కానీ అధికారం ఉందన్న అహంతో దాడులు చేయడం సరికాదన్నారు. శిలాఫలకం ధ్వంసం చేసిన మద్దిపూడి రాంబాబు, వేములపల్లి వెంకట్‌రావు, కంచి శ్రీను, కుంభం విజయ్‌ అనే నలుగురు కాంగ్రెస్‌ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. తమపై దురుసుగా ప్రవర్తించారని బీఆర్‌ఎ్‌సకు చెందిన సర్పంచ్‌ వంకా బ్రహ్మన్న, గౌండ్ల సత్యనారాయణ, నక్క సైదులు, శివాల కృష్ణమూర్తిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Jan 31 , 2024 | 11:57 PM

Advertising
Advertising