బావమరిది హత్య కేసులో జీవితఖైదు
ABN, Publish Date - Jan 31 , 2024 | 11:58 PM
బావమరిది హత్య కేసులో బావకు జీవితఖైదు పడింది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన సీత ముత్యాలుకు జీవితఖైదు విధిస్తూ నల్లగొండ సెషన్స జడ్జి ఎం నాగరాజు బుధవారం తీర్పునిచ్చారు.
పెద్దఅడిశర్లపల్లి/ నల్లగొండ టౌన, జనవరి 31 : బావమరిది హత్య కేసులో బావకు జీవితఖైదు పడింది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన సీత ముత్యాలుకు జీవితఖైదు విధిస్తూ నల్లగొండ సెషన్స జడ్జి ఎం నాగరాజు బుధవారం తీర్పునిచ్చారు. ఈ హత్య కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.పీఏపల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన ఆడ్ల మారయ్య కుమార్తె ముత్యాలమ్మను తిరుమలగిరి గ్రామానికి చెందిన సీత ముత్యాలుకు ఇచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో ముత్యాలమ్మ తల్లిగారింటికి వచ్చి ఉంటోంది. దీంతో పలుమార్లు పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోవడంతో భార్య తన వద్దకు రాకపోవడానికి మామ మారయ్య, బావమరిది అంజయ్య కారణమని, వారిపై కక్ష పెంచుకుని 2017 మే 24న గొర్రెల షెడ్ ముందు నిద్రిస్తున్న బావమరిది అంజయ్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. అంజయ్య తండ్రి మారయ్య ఫిర్యాదు మేరకు నిందితుడు సీత ముత్యాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అనంతరం ఆధారాలు కోర్టుకు సమర్పించగా బుధవారం విచారణ అనంతరం నిందితుడు ముత్యాలుకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు విషయంలో సరైన ఆధారాలు సేకరించి కోర్టుకు అందజేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన ఇన్వెస్టిగేషన ఆఫీసర్స్ కె.శివరాంరెడ్డి, ఏ.రంజితరెడ్డి, పీపీ నందనపల్లి శ్రీనివాస్, పీసీలు శంకర్‌రాజు, సీడీవో వెంకటేశ్వర్లు, నరేందర్, మల్లిఖార్జునను నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి అభినంధించారు.
Updated Date - Jan 31 , 2024 | 11:58 PM