ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అధికార బలంతో ఆక్రమించారు

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:52 PM

అధికార బలంతో తమ స్థలం ఆక్రమించి ఇల్లు నిర్మించుకుందని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోదాడ బీఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎంపీపీ చింతా కవిత ఇంటి ముందు బాధితులు ఆందోళన చేశారు.

మాజీ ఎంపీపీ కవిత గెస్ట్‌హౌస్‌ ముందు ఆందోళన చేస్తున్న బాధితులు

స్థలాన్ని తిరిగి అప్పగించాలి: బాధితులు

కోదాడ మాజీ ఎంపీపీ ఇంటి ముందు బాధితుల ఆందోళన

ఆ భూమిని విక్రయించారు : మాజీ ఎంపీపీ కవిత

కోదాడ రూరల్‌, జనవరి 30 : అధికార బలంతో తమ స్థలం ఆక్రమించి ఇల్లు నిర్మించుకుందని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోదాడ బీఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎంపీపీ చింతా కవిత ఇంటి ముందు బాధితులు ఆందోళన చేశారు. తమ పూర్వీకులకు ఇనాంగా వచ్చిన భూమిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అధికారం చెలాయించి బలవంతంగా ఆక్రమించుకుందని ఆరోపించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఆ ఇంటిలోకి ఎవరూ వెళ్లకుండా చూడాలన్న ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాల మేరకు ఆర్డీవో సీజ్‌ చేసి ఇరువర్గాల వారీకి నోటీసులు జారీ చేశారు. బాధితుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలోని సర్వే నెంబరు 152/1లో 7 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని జమీందారుల కాలంలో మంగలి వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న మాధవరపు లక్ష్మయ్యకు ఇనాంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వారుసులు మాధవరపు వెంకటయ్య, మాధవరపు ముత్తయ్య, గురవయ్య, సీతారాములు, గోపాల్‌, వెంకటేశ్వర్లు అక్కడే ఉంటున్నారు. ఇదిలా ఉండగా లక్ష్మయ్య భూమి పక్కనే కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవితకు కొంతభూమి ఉంది. ఏడాది కిందట లక్ష్మయ్య వారసులను పిలిపించి భూమి ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని, మా భూమితో పాటు మీ భూమికి కూడా ఫెన్సింగ్‌ వేయిస్తానంటూ చెప్పటంతో వారు అంగీకరించారు. ఆ తర్వాత ఆ భూమి తమదేనంటూ చెబుతుండటంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంపీపీ కవిత నిర్బంధంగా భూమిని స్వాధీనం చేసుకుని చుట్టూ ప్రహరీ నిర్మించడంతో పాటు ఏడాది కిందట గెస్ట్‌హౌస్‌ కూడా నిర్మించింది. నిర్మాణ సమయం నుంచి లక్ష్మయ్య వారసులు ఆ భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.

అధికారం కోల్పోవడంతో..

బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో పాటు ఎంపీపీ కవితపై సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో ఆమె తన పదవికి రాజీనామా చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఉండటంతో తమకు న్యాయం జరుగుతుందని భావించిన లక్ష్మయ్య వారసులు ఎమ్మెల్యే పద్మావతితో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో కవిత నిర్మించిన గెస్ట్‌హౌస్‌ వద్దకు వెళ్లి టెంట్‌ వేసుకుని ఆందోళన ప్రారంభించారు. ఆక్రమించిన తమ భూమిని తిరిగి ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. టెంట్‌ను తీసివేసేందుకు ఎంపీపీ కవిత, ఆమె అనుచరులు ప్రయత్నించగా తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్రమంగా తన ఇల్లును ఆక్రమించారని కవిత డీఎస్పీ, సీఐ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదుచేసింది. 8 గంటల ప్రాంతంలో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ వేసిన టెంటును తొలగించి ఆందోళనకారులతో మాట్లాడారు. ఒకదశలో లక్ష్మయ్య వారుసులు క్రిమిసంహారక మందు తాగడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని, వారందరినీ బలవంతంగా ఒంటి గంట సమయంలో కోదాడ రూరల్‌ పోలీసుస్టేషనకు తరలించారు. ఈ తతంగమంతా ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు సాగింది. పోలీసులతో చర్చించిన లక్ష్మయ్య వారసులు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి గ్రామానికి చేరుకున్నారు.

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా..

గుడిబండ గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభించడానికి ఎమ్మెల్యే పద్మావతి గ్రామానికి వచ్చారు. దీంతో లక్ష్మయ్య వారసులు తమ భూమిని మాజీ ఎంపీపీ కవిత ఆక్రమించిందని, ఆందోళన చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ సాయికుమార్‌గౌడ్‌ల స్థలాన్ని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కవితతో పాటు లక్ష్మయ్య వారసులకు నోటీసులు జారీ చేసి ఇంటిని సీజ్‌ చేశారు. సమస్య పరిష్కారమయ్యే ఎవరూ ఆ భూమిలోకి వెళ్లవద్దని నోటీసులు ఇచ్చి, ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కోర్టుల చుట్టూ తిప్పింది: లక్ష్మయ్య వారసులు

నమ్మించి తమ భూమిలో ఇల్లు కట్టుకుందని లక్ష్మయ్య వారసులు ఆరోపించారు. నిర్మాణ సమయంలో అడ్డుతగిలితే అధికారాన్ని అడ్డుపెట్టి అక్రమ కేసులు నమోదు చేయించి, కోర్టుల చుట్టూ తిప్పిందని వాపోయారు. పోలీ్‌సస్టేషనలో కూడా తమను నాలుగు రోజుల పాటు నిర్బంధించిందని వారన్నారు. అధికారంలో ఉండటంతో కవిత ఇష్టారాజ్యంగా వ్యవహరించి, తమ భూమిని స్వాధీనం చేసుకుందన్నారు.

ఆ భూమిని విక్రమించారు : కవిత, మాజీ ఎంపీపీ

మాధవరపు లక్ష్మయ్య వారసులు వారి భూమిని విక్రయించారని మాజీ ఎంపీపీ కవిత అన్నారు. కొనుగోలు చేసిన తర్వాతే అక్కడ నిర్మా ణం చేపట్టామన్నారు. లక్ష్మయ్య వారసుల ఆరోపణలు నిజం కాదన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:52 PM

Advertising
Advertising