డ్రైవర్ల అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
ABN, Publish Date - Jan 25 , 2024 | 12:05 AM
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమని ఎంవీఐ ప్రవీణ్‌రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ టౌన, జనవరి 24 : అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమని ఎంవీఐ ప్రవీణ్‌రెడ్డి అన్నారు. డ్రైవర్స్‌డే సందర్భంగా బుధవారం మిర్యాలగూడ డిపోలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎంవీఐ పలు అంశాలపై అవగాహన కల్పించారు. మద్యానికి దూరంగా ఉండాలని, విధి నిర్వహణలో సెల్‌ఫోన వాడరాదన్నారు. అనంతరం ఉత్తమ డ్రైవర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎం పాల్, అధికారులు సంధ్యారాణి, యాదగిరి, వెంకన్న, జనార్ధన, జేఆర్‌రెడ్డి, శ్రీనివాస్, పీఎనరావు పాల్గొన్నారు.
నల్లగొండ: డ్రైవర్స్‌డే సందర్భంగా పట్టణంలోని రీజీయన ట్రైనింగ్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు. డిపో మేనేజర్, ఎంవీఐలు పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏటీఎం, ఏడీసీ, రీజియన ఎల్‌వో ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
కేతేపల్లి: మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన ఆధ్వర్యంలో డ్రైవర్లకు వైద్యశిబిరాన్ని నిర్వహించారు. కంటి పరీక్షలు చేశారు. వివిధ వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎల్ సాయికుమార్, ఆర్‌ఈ మల్యాద్రి, ఎనహెచఏఐ అధికారి సతీష్, రాఘవ, టోల్ మేనేజర్ శివకుమార్, అపోలో టైర్స్ ఫౌండేషన ప్రోగ్రాం మేనేజర్ స్వప్న, డాక్టర్ రమ, వరలక్ష్మి పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను ఇనచార్జి డీఎం వెంకటమ్మ సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహ, ఎల్‌హెచ యాసీనఅలీ, టీఐ ఎంవీచారి, కంట్రోలర్ శ్రీనివాసులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 25 , 2024 | 12:05 AM