పశుసంవర్ధకశాఖ జేడీగా సుబ్బారావు బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Jan 30 , 2024 | 12:05 AM
జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీగా ఎంవీ.సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు.
నల్లగొండ, జనవరి 29: జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీగా ఎంవీ.సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన శ్రీనివాసరావు సెలవులపై వెళ్లడంతో ఆస్థానంలో సుబ్బారావు నియమితులయ్యారు. సుబ్బారావు గతంలో జిల్లాలోని పశుసంవర్ధశాఖ కార్యాలయంలో జేడీగా పనిచేసి ఆ తర్వాత హైదరబాద్ రాష్ట్ర కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. తిరిగి జేడీగా అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు.
రేపు స్టాఫ్‌నర్సు అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు
స్టాఫ్‌నర్సు పోస్టులకు జిల్లా నుంచి ఎంపికైన 269మంది అభ్యర్థులకు ఈనెల 31న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంతరెడ్డి పోస్టింగ్ ఉత్తర్వులు అందజేయనున్నట్టు డీఎంహెచవో కొండల్‌రావు తెలిపారు. సోమవారం అభ్యర్థులు డీఎంహెచవో కార్యాలయంలో రిపోర్ట్ చేయగా, ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. 31న ఉదయం 8గంటలకు అభ్యర్థులంతా డీఎంహెచవో కార్యాలయానికి చేరుకోవాలని, వారిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తీసుకెళ్తామన్నారు. ఉత్తర్వులు అందిన వెంటనే ఆయా శాఖలకు అలాంట్‌మెంట్ ఉంటుందన్నారు. 269మంది అభ్యర్థుల గుర్తింపు కార్డులు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచవో కృష్ణయ్య, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jan 30 , 2024 | 12:05 AM