ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బంజారాలకు దక్కిన గౌరవం

ABN, Publish Date - Jan 27 , 2024 | 12:57 AM

కేతావత సోమ్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం బంజారాలకు దక్కిన గౌరవమని గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవసోతు ఠీకం రాథోడ్‌, ప్రజాగాయకుడు భిక్షునాయక్‌ అన్నారు.

సోమ్‌లాల్‌ను సన్మానిస్తున్న గిరిజన సంఘ ప్రతినిధి

భువనగిరి రూరల్‌, జనవరి 26 : కేతావత సోమ్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం బంజారాలకు దక్కిన గౌరవమని గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవసోతు ఠీకం రాథోడ్‌, ప్రజాగాయకుడు భిక్షునాయక్‌ అన్నారు. సోమ్‌లాల్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి గ్రామానికి చెందిన సోమ్‌లాల్‌ 30 ఏళ్ల కిందట తండాను విడిచి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజరుగా విధులు నిర్వహిస్తూ ఐదేళ్ల కిందట వీఆర్‌ఎస్‌ తీసుకొని బంజారా జాతిని జాగృతం చేసేందుకు సమారు 200లకు పైగా పాటలు రాశారన్నారు. 1988లో భగవద్గీతను బంజారా భాషలోకి అనువాదం మొదలు పెట్టి 16 నెలల కృషితో పూర్తి చేశారని, 1989 నాటికే 701 శ్లోకాలతో భగవద్గీత అనువాదం పూర్తయినా అచ్చుకావడానికి ఆయన 25ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చిందన్నారు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత బంజారా భగవద్గీతను టీటీడీ దేవస్థానానికి అందజేయగా 2014లో ప్రచురితం చేసిందన్నారు.

సోమ్‌లాల్‌ను ఆహ్వానించిన గవర్నర్‌ తమిళిసై, సీఎంవో అధికారుల అభినందన

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సోమ్‌లాల్‌ను రాజ్‌భవనకు రావాలని గవర్నర్‌ తమిళిసై ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం రాజ్‌భవనకు ఆయన వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను గవర్నర్‌ అభినందించారు. అదేవిధంగా సీఎం కార్యాలయ అధికారులు కూడా ఫోన చేసి అభినందనలు తెలిపినట్లు సోమ్‌లాల్‌ తెలిపారు.

Updated Date - Jan 27 , 2024 | 12:58 AM

Advertising
Advertising