ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:54 PM

ఖమ్మం జిల్లాప్రజల దాహార్తిని తీర్చేందుకు పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేయనున్నారు.

11.8 అడుగులకు చేరిన పాలేరు జలాశయం

తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు

పాలేరు జలాశయం నింపాలని ప్రభుత్వం నిర్ణయం

ఖమ్మం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికే నీటి విడుదల

నాగార్జునసాగర్‌, జనవరి 30: ఖమ్మం జిల్లాప్రజల దాహార్తిని తీర్చేందుకు పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ఎడమకాల్వకు బుధవారం ఉదయం 10 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పాలేరు జలాశయంలో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం రేవంతరెడ్డితో మాట్లాడి పాలేరు జలాశయం నింపేందుకు ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి ఎడమకాల్వ ద్వారా రోజుకు ఐదు వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పాలేరు జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 22.5 అడుగుల కాగా ప్రస్తుతం 11.8 అడుగులుగా ఉంది. దీంతో ఖమ్మం పట్టణానికి తాగునీటి సరఫరా కష్టమవుతుంది. ఈ మేరకు పాలేరు జలాశయాన్ని నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేఆర్‌ఎంబీ సభ్యుల పర్యవేక్షణలో నీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. నీరు వృథా కాకుండా ఉండేందుకు ఎడమకాల్వ పరిధిలోని మేజర్లు, మైనర్లు, తూముల, షట్టర్ల వద్ద సిబ్బందిని కాపలా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 520.10 అడుగులు (149.4580 టీఎంసీలు)గా నమోదైంది. సాగర్‌ నుంచి జంట నగరాల తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువ నుంచి ఎలాంటి నీటి రాక లేదు. సాగర్‌ కుడి, ఎడమ, వరదకాల్వలకు ప్రధాన జలవిద్యుత కేంద్రానికి ఎలాంటి నీటి విడుదల లేదు.

Updated Date - Jan 30 , 2024 | 11:54 PM

Advertising
Advertising