ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రసవత్తరంగా మునిసిపల్‌ వైస్‌చైర్మనపై అవిశ్వాసం

ABN, Publish Date - Jan 09 , 2024 | 12:24 AM

హుజూర్‌నగర్‌ మునిసిపల్‌ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాస సమావేశానికి ముహుర్తం ఖరారైంది.

24న ప్రత్యేక సమావేశం

కౌన్సిలర్లకు నోటీసు జారీ చేసిన కలెక్టర్‌

హుజూర్‌నగర్‌, జనవరి 8 : హుజూర్‌నగర్‌ మునిసిపల్‌ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాస సమావేశానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరావు మొ త్తం 28 మంది కౌన్సిలర్లకు ఈ నెల 6న నోటీసులు జారీచేశారు. దీం తో వైస్‌చైర్మనపై అవిశ్వాస వ్యవహారం రసవత్తరంగా మారింది. గతంలోనే మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా 17 మంది అవిశ్వాసం నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మునిసిపాలిటీలో రాజకీయ పార్టీల బలాబలాలు పూర్తిగా తారుమారయ్యాయి. గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన చైర్మన గెల్లి అర్చన కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వైస్‌చైర్మన పదవిని కాంగ్రెస్‌ పార్టీ కైవసం ప్రయత్నాలు చేస్తోంది. 2020 జనవరిలో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏడు మునిసిపల్‌ కౌన్సిలర్‌ స్థానాలు, సీపీఎం ఒకటి, బీఆర్‌ఎస్‌ 20 గెలుపొందాయి. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చైర్మనతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఎన్నికల అనంతరం మరో ఆరుగురు కాంగ్రె్‌సలో చేరారు. మొత్తంగా బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బీఆర్‌ఎ్‌సలో ప్రస్తుతం 10 మంది కౌన్సిలర్లు ఉండగా ఈ నెల 24న జరగనున్న వైస్‌చైర్మనపై అవిశ్వాస తీర్మానం నాటికి మరికొందరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కలెక్టర్‌ అవిశ్వాస సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటీసులు అందించడంతో కాంగ్రెస్‌ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉండగా వైస్‌చైర్మన పీఠాన్ని కాంగ్రెస్‌ దక్కించుకోనుంది. ప్రస్తుతం చేరికలతో 17 మంది కౌన్సిలర్లు ఉండగా కాగా వారం రోజుల్లో మరికొందరు చేరే అవకాశం ఉంది. దీంతో వైస్‌చైర్మనపై అవిశ్వాసం నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీలో వైస్‌చైర్మన అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీలోపు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పటిలోగా కౌన్సిలర్ల అభిప్రాయాన్ని సేకరించనున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising