ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పీడీఎస్‌ బియ్యంతో వ్యాపారం చేస్తే పీడీయాక్ట్‌

ABN, Publish Date - Jan 19 , 2024 | 12:34 AM

పీడీఎస్‌ బియ్యంతో వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

సూర్యాపేట క్రైం, జనవరి 18 : పీడీఎస్‌ బియ్యంతో వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఒక మంచి లక్ష్యం, ఉద్దేశ్యంతో పేదల సంక్షేమం కోసం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం అందిస్తోందన్నారు. ఆ బియ్యంతో అక్రమాలకు పాల్పడినా, అక్రమమార్గంలో విక్రయించినా, రీసైక్లింగ్‌ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రేషన డీలర్లు, మిల్లర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. అక్రమ రవాణా, వ్యాపారం చేసే వారిపై పోలీస్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.

Updated Date - Jan 19 , 2024 | 12:34 AM

Advertising
Advertising