500 గ్రాముల గంజాయి పట్టివేత
ABN, Publish Date - Jan 05 , 2024 | 11:45 PM
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారినుంచి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని బొపునారం బండమీదిపల్లి చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది.
బంట్వారం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారినుంచి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని బొపునారం బండమీదిపల్లి చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ప్రశాంత్‌వర్ధన్ బొపునారం బండమీదిపల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టారు. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి తోర్మామిడి వైపు వస్తుండగా తనిఖీ చేశారు. వారివద్ద 500 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడడంతో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బంట్వారం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Jan 05 , 2024 | 11:45 PM