ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నట్టల నివారణకు ‘అల్బెండజోల్‌’ మాత్రలు వాడాలి

ABN, Publish Date - Feb 02 , 2024 | 12:16 AM

పిల్లల్లో నట్టల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరిగా వేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఈనెల 12న జాతీయ నులి పురుగుల నివారణ దినం పురస్కరించుకొని గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వరరావు

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు

రంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 1 : పిల్లల్లో నట్టల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరిగా వేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఈనెల 12న జాతీయ నులి పురుగుల నివారణ దినం పురస్కరించుకొని గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు పిల్లలందరికీ నట్టల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలు వేయాలని తెలిపారు. ఏడాది నుంచి రెండేళ్ల చిన్నారులకు సగం మాత్ర స్పూన్‌ ద్వారా పొడిచేసి నీటితో వేయాలని, మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే వేయాలని సూచించారు. 2-3 సంవత్సరాల వారికి ఒక పూర్తి మాత్ర పొడిచేసి వేయాలని చెప్పారు. 3-19 సంవత్సరాల వయస్సు వారు చప్పరించి లేదా నమిలి మింగేటట్లు చూడాలన్నారు. ఇలా ఒకటి నుంచి 19 ఏళ్ల వారందరికీ, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో అల్బెండజోల్‌ మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పిల్లల్లో మట్టి ద్వారా నులిపురుగుల గుడ్లు పిల్లల చేతుల ద్వారా శరీరంలోకి చేరి నులిపురుగులుగా, ఏలిక పాములుగా, కొంకిపురుగులు అనే పరాన్న జీవులుగా పెరిగి పిల్లల్లో తీవ్ర పోషకారలోపం కలుగచేస్తాయని చెప్పారు. అదేవిధంగా రక్తహీనత, కడుపునొప్పి వంటి అనారోగ్య లక్షణాలు కలగచేస్తాయని అన్నారు. ఏడాదికి రెండుసార్లు అల్బెండజోల్‌ మాత్రలు వేయాలని సూచించారు. జిల్లాకు 9 లక్షల మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా ప్రతికూల లేదా చెడు ప్రభావం ఏర్పడితే వెంటనే వైద్యసిబ్బందికి, దగ్గరలో ఉన్న వైద్యాధికారులకు తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రాథమిక కేంద్రాల వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:17 AM

Advertising
Advertising