ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తప్పిన పెను ముప్పు

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:19 PM

కందుకూరులో ఆదివారం త్రుటిలో పెను ముప్పు తప్పింది. బాధితులు పోలీస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

కందుకూరులో మెకానిక్‌ షెడ్డులోకి దూసుకెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు

అదుపుతప్పి మెకానిక్‌ షెడ్డులోకి దూసుకెళ్లిన కారు

త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ మెకానిక్‌లు

కందుకూరు, జనవరి 28 : కందుకూరులో ఆదివారం త్రుటిలో పెను ముప్పు తప్పింది. బాధితులు పోలీస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని గిరి ట్రాక్టర్‌ మెకానిక్‌ షెడ్డులో ఇద్దరు మెకానిక్‌లు ట్రాక్టర్‌ రిపేర్‌ పనుల్లో ఉన్నారు. మధ్యాహ్నం 12:30సమయంలో నగరం నుంచి కడ్తాల్‌లో ఉన్న వెంచర్‌లో పాట్లు చూసేందుకని కొందరు కారు(టీఎస్‌05 కె1658)లో వెళ్తున్నారు. కారు మెకానిక్‌ షెడ్డు వద్ద అతివేగంగా వెళ్తున్న సమయంలో సడెన్‌ బ్రేక్‌ వేశారు. దీంతో కారు అదుపుతప్పి అదే వేగంతో మెకానిక్‌ షెడ్డులోకి దూసుకెళ్లింది. అక్కడ నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను, రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదానికి రెండు నిమిషాల ముందే మెకానిక్‌లు భాను, మరో వ్యక్తి అప్పటి వరకు ట్రాక్టర్‌ రిపేర్‌ చేసి షెడ్డులోనికి వెళ్లారు. అంతలోనే కారు వచ్చి ఢీకొంది. ఒకవేళ వారు అక్కడే రిపేర్‌ పనిలో ఉండి ఉంటే ఇద్దరి ప్రాణాలకు ముప్పు కలిగేదని స్థానికులు అన్నారు. ఇదిలా కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:20 PM

Advertising
Advertising