ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధ్యానం.. ప్రపంచశాంతికి దోహదం

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:11 AM

సంయుక్తంగా చేసే ధ్యానంతో ప్రపంచశాంతిని నెలకొల్పవచ్చని, అది శాస్ర్తీయంగా ధ్రువీకరణ అయిందని మహర్షి వేదిక్‌ సంస్థ గురువు టోని నాడార్‌ అన్నారు. మండల పరిధి కన్హాశాంతివనంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక సంస్థ మహర్షి వేదిక్‌ ఆధ్వర్యంలో ప్రపంచశాంతి కోసం 10 వేల మందితో 13 రోజులుగా ధ్యాన అసెంబ్లీని నిర్వహించారు.

నందిగామ, జనవరి 11: సంయుక్తంగా చేసే ధ్యానంతో ప్రపంచశాంతిని నెలకొల్పవచ్చని, అది శాస్ర్తీయంగా ధ్రువీకరణ అయిందని మహర్షి వేదిక్‌ సంస్థ గురువు టోని నాడార్‌ అన్నారు. మండల పరిధి కన్హాశాంతివనంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక సంస్థ మహర్షి వేదిక్‌ ఆధ్వర్యంలో ప్రపంచశాంతి కోసం 10 వేల మందితో 13 రోజులుగా ధ్యాన అసెంబ్లీని నిర్వహించారు. కార్యక్రమాన్ని గురువారం గ్లోబల్‌ యూనియన్‌ ఆఫ్‌ సైంటిస్ట్స్‌ ఫర్‌ పీస్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో ధ్యానం చేయడంతో వ్యక్తిగత, ప్రపంచశాంతికి ఉపయోగపడేలా సాంకేతికంగా నిరూపితమయ్యిందని, న్యూరో సైంటి్‌స్టలు, వైద్యులు ధ్రువీకరించారని టోని నాడార్‌ చెప్పారు. ప్రపంచశాంతిని సృష్టించడానికి స్పృహ ఆదారిత ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక సందేశానిచ్చారు. కార్యక్రమానికి 139 దేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 11 వేల మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మహర్షి వేదిక్‌ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:11 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising