ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముచ్చింతల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:51 PM

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని ముచ్చింతల్‌లో శ్రీరామనగరం దివ్యసాకేతాన్ని సందర్శించారు.

మోహన్‌ భగవత్‌కు సీతారాముడు, లక్ష్మణుడి ప్రతిమలను అందజేస్తున్న చినజీయర్‌

చినజీయర్‌ ఆశీస్సులు తీసుకున్న మోహన్‌ భగవత్‌

శంషాబాద్‌ రూరల్‌ జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని ముచ్చింతల్‌లో శ్రీరామనగరం దివ్యసాకేతాన్ని సందర్శించారు. ప్రముఖ అధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం 9.30 గంటలకు దివ్యసాకేతానికి చేరుకున్న మోహన్‌ భగవత్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చినజీయర్‌తో కలిసి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దాదాపు 40 నిమిషాలు చినజీయర్‌తో సమావేశమయ్యారు. స్వామీజీ ఆశీస్సుల కోసమే మోహన్‌ భగవత్‌ ఆశ్రమానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్‌ భగవత్‌కు మంగళశాసనాలు, తీర్థప్రసాదాలు అందించినట్లు స్వామిజీ తెలిపారు. ఆలయంలో వేదపండితులు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌కు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మోహన్‌ భగవత్‌కు చిన జీయర్‌స్వామి వేంకటేశ్వరుడు, సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడి ప్రతిమలను అందజేశారు.

Updated Date - Jan 30 , 2024 | 11:51 PM

Advertising
Advertising