ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థులు చదువులకే పరిమితం కావొద్దు

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:38 PM

విద్యార్థులు చదువుకే పరిమితం కావొద్దని సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో అభిరుచి పెంచుకోవాలని ప్రముఖ సినీ డైరెక్టర్‌, స్ర్కిప్ట్‌రైటర్‌ ప్రశాంత్‌వర్మ అన్నారు.

మాట్లాడుతున్న డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ

మేడ్చల్‌ టౌన్‌, జనవరి 28: విద్యార్థులు చదువుకే పరిమితం కావొద్దని సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో అభిరుచి పెంచుకోవాలని ప్రముఖ సినీ డైరెక్టర్‌, స్ర్కిప్ట్‌రైటర్‌ ప్రశాంత్‌వర్మ అన్నారు. మేడ్చల్‌ పట్టణం అత్వెల్లి విజ్ఞాన్‌ గ్లోబాల్‌ జైన్‌ పాఠశాలలో శనివారం రాత్రి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రశాంత్‌ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులతో పాటు ఇతర రంగాలపై ఆసక్తి కనపరచాలన్నారు. అన్నిరంగాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే వారు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారని అన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో పాటు, పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్‌చైర్మన్‌ రాణి రుద్రమ దేవి, పాఠశాల హ హెచ్‌ఎం జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:38 PM

Advertising
Advertising