ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా ముగిసిన జిల్లా సైన్స్‌ఫేర్‌

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:30 AM

విద్యార్థుల సృజనాత్మకత, మేధాశక్తికి ప్రతిరూపంగా విద్యా ప్రదర్శనలు నిలుస్తున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌ రావు అన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌ రావు

జిల్లా స్థాయిలో 312 పాఠశాలల విద్యార్థుల ప్రదర్శన

ఆద్యాంతం ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ

అలంరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రత్యేక ఆకర్షణగా బాలికల బంజారా నృత్యం

విద్యార్థుల సృజనాత్మకతశక్తికి ప్రతిరూపమే విద్యాప్రదర్శనలు

జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌ రావు

ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల జనవరి 10ః విద్యార్థుల సృజనాత్మకత, మేధాశక్తికి ప్రతిరూపంగా విద్యా ప్రదర్శనలు నిలుస్తున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌ రావు అన్నారు. గురుకుల విద్యాపీఠ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న 51వ జిల్లా స్థాయి సైన్స్‌, మ్యాథమాటిక్స్‌, పర్యావరణ ప్రదర్శన బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ సుశీందర్‌ రావు పాల్గొని మాట్లాడుతూ ఆలోచనలు భిన్నంగా ఉంటే ఆ విష్కరణలు సైతం భిన్నంగా ఉంటాయని అన్నారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంచుతాయని అన్నారు. మనం అనుభవిస్తున్న విజ్ఞాన పలాలు ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి శ్రమ పలితమని ప్లానటరీ సొసైటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ నేథనియల్‌ అన్నారు. ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన ప్రాజెక్టులకు డీఈఓ చేతుల మీదుగా బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌ రావు, కోఆర్డ్డినేటర్‌ రాజిరెడ్డి, డిసిఈబి సెక్రటరీ రాంచంద్రా రెడ్డి ,మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, గురుకుల విద్యాపీఠ్‌ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డీ.శ్రీనివాస్‌ రావు, పీఆర్‌టీయూ ఉపాధ్యా సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధన్‌ యాదవ్‌, పాల్గొన్నారు.

కడ్తాల్‌ ప్రగతి స్కూల్లో ఘనంగా సైన్స్‌ఫెయిర్‌

కడ్తాల్‌, జనవరి 10 : మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో బుధవారం వైజ్ఙానిక వస్తు ప్రదర్శన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించే మేళాను పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహ్మరెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, లయన్స్‌క్లబ్‌ జిల్లా మాజీ గవర్నర్‌ జి. చెన్నకిషన్‌రెడ్డి, ట్రస్మా రాష్ట్ర ప్రతినిధులు అల్లాజీగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, తల్లోజు వెంకటయ్య, నల్లబోలు సుధీర్‌రెడ్డిలతో కలిసి పాఠశాల కరస్పాండెంట్‌ కె.సువర్ణగోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు బిను, అధ్యాపకుల బృందం పర్యవేక్షణలో విద్యార్థినీవిద్యార్థులు 162 అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఎంఈవో సర్ధార్‌ నాయక్‌, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యనాయక్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగయ్య, అరుణ, లయన్స్‌క్లబ్‌ మాజీ గవర్నర్‌ సందడి నరేందర్‌ రెడ్డిలు సందర్శించారు.

Updated Date - Jan 11 , 2024 | 12:30 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising