ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజాస్వామ్యంపై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దాడి

ABN, Publish Date - Jan 22 , 2024 | 11:58 PM

ఏఐసీసీ సభ్యుడు రాహుల్‌గాంధీపై ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ కార్యకర్తలు చేసిన దాడి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి అని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్‌ అలీ అన్నారు

కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన

సూర్యాపేట టౌన, జనవరి 22 : ఏఐసీసీ సభ్యుడు రాహుల్‌గాంధీపై ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ కార్యకర్తలు చేసిన దాడి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి అని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్‌ అలీ అన్నారు. దాడికి నిరసనగా సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ నుంచి గాంధీ బొమ్మ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించి, మాట్లాడారు. దేశాన్ని సమైక్యంగా ఉంచాలని రాహుల్‌గాంధీ ఇటీవల మణిపూర్‌ నుంచి భారత జోడో న్యాయ్‌యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. అస్సాం రాష్ట్రంలోని సోనితపూర్‌లో ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ కార్యకర్తలు యాత్రకు వస్తున్న ఆదరణ చేసి ఓర్వలేక దాడులకు ప్రయత్నించడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్రమోదీ కేవలం ఎన్నికల సమయంలో మతాలు, కులాలను ప్రభావితం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. దేశ అభివృద్ధి, ప్రజా సమస్యలపై ఏమాత్రం దృష్టి సారించని కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు అబ్దుల్‌ రహీం, కోతి గోపాల్‌రెడ్డి, చింతమళ్ల రమేష్‌, చెంచల శ్రీనివాస్‌, ఆలేటి మాణిక్యం, పడిదల రమికుమార్‌, శనగాని రాంబాబుగౌడ్‌, నాగుల వాసు, నాగరాజుగౌడ్‌, నరేందర్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2024 | 11:58 PM

Advertising
Advertising