ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరు గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:07 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి అన్నారు.

శాంతినగర్‌లో ప్రజాపాలనలో మహిళలతో మాట్లాడుతున్న శ్రీదేవి

వాణిజ్య పన్నుల ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి

కొడంగల్‌/బొంరా్‌సపేట్‌, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి అన్నారు. మంగళవారం కొడంగల్‌ మున్సిపాలిటి పరిధిలోని శాంతినగర్‌ 6వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో అత్యవసరమైన వాటిని గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు పథకాల పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి రేషన్‌ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని, తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అంతకు ముందు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులకు కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రీదేవికి అర్చకుల సంఘం వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థచారి వినతి పత్రం అందించారు. అర్చకులకు హెల్త్‌ కార్డులు, అర్చక వెల్ఫెర్‌ ఫండ్‌గ్రాంటు వర్తింపజేయాలని, గుర్తింపు కార్డులు అందించి, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ శేఖర్‌, డీఆర్‌డీవో పీడీ కృష్ణన్‌, కడా స్పెషల్‌ ఆఫీసర్‌ కుంచాల వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే బొంరా్‌సపేట్‌ మండలంలింగన్‌పల్లిలో ప్రజాపాలనను కలెక్టర్‌ పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డును పరిగణలోకి తీసుకొని దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Updated Date - Jan 02 , 2024 | 11:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising