ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలి
ABN, Publish Date - Jan 20 , 2024 | 11:13 PM
ఈ నెల 22న అయోఽధ్యలో రామమందిరంలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ అన్నారు.
- బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్
- గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానంలో శ్రమదానం
జడ్చర్ల, జనవరి 20 : ఈ నెల 22న అయోఽధ్యలో రామమందిరంలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ అన్నారు. ఆలయాలను పరిశుభ్రం చేసేందుకు శ్రమదానం చేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయంలో శనివారం స్వచ్‌మందిర్ కార్య క్రమాన్ని చేపట్టారు. దేవాలయం ప్రాంగణమంతా కడిగారు. అనంతరం దేవాల య ప్రాంగణంలో జరిగిన లక్ష్మీచెన్నకేశవస్వామి అష్టోత్తర శత సంకీర్తన కార్యక్ర మంలో పాల్గొన్నారు. భజన కళాకారులతో కలిసి భజన చేశారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ నాయకులు రమేశ్‌జీ, నాగరాజు, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆంజనేయులు, వెంకటేశ్, మహేందర్, శేఖర్, కిట్టు, నవీన్ పాల్గొన్నారు.
Updated Date - Jan 20 , 2024 | 11:13 PM