ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లక్షల కోట్లతో చేసిన అభివృద్ధి శూన్యం

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:18 AM

గత ప్రభుత్వం పదేళ్లలో ఆరున్నర లక్ష ల కోట్లు అప్పు చే సి చేసిన అభివృ ద్ధి శూన్యమని నకిరేకల్‌ ఎమ్మెల్యే వే ముల వీరేశం వి మర్శించారు.

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న వీరేశం

లక్షల కోట్లతో చేసిన అభివృద్ధి శూన్యం

చిట్యాల, జ నవరి 11: గత ప్రభుత్వం పదేళ్లలో ఆరున్నర లక్ష ల కోట్లు అప్పు చే సి చేసిన అభివృ ద్ధి శూన్యమని నకిరేకల్‌ ఎమ్మెల్యే వే ముల వీరేశం వి మర్శించారు. గు రువారం చిట్యాలలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత పాలకులు బాధ్యత లేకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల సొమ్మును దుబారా చేశారని ఆరోపించారు. తె లంగాణ పునర్నిర్మాణం పేరుతో వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆరోపించారు. డబ్బులు లేకున్నా ప్రజలను మభ్యపెట్టడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కొ బ్బరికాయలు కొట్టారని విమర్శించారు. ధ్వంసమైన వ్యవస్థలను కాపాడుకోవడానికి మనందరం పనిచేయాలన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేశామని, మరో పది రోజుల్లో రూ.500లకు గ్యాస్‌ పథకం, ఉచితగృహ విద్యుత పథకం అమలుచేయనున్నట్లు తెలిపారు. వంద రోజుల్లో అన్ని పథకాలను అమలుచేయనున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని 73మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన కోమటిరె డ్డి వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన కూరెల్ల లింగస్వామి, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, కౌ న్సిలర్లు జడల పూలమ్మ, కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, తహీసీల్దార్‌ దశరథ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising