ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జానపహాడ్‌ ఉత్సవాలకు పటిష్ఠ భద్రత : ఎస్పీ

ABN, Publish Date - Jan 11 , 2024 | 11:59 PM

మండలంలోని జానపహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. ఉర్సు సందర్భంగా ఏర్పాటు చేసే పార్కింగ్‌ స్థలాలను గురువారం పరిశీలించి, పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు.

జానపహాడ్‌ దర్గాలో పార్కింగ్‌ స్థలాన్ని పరిఽశీలిస్తున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

పాలకవీడు, జనవరి 11 : మండలంలోని జానపహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. ఉర్సు సందర్భంగా ఏర్పాటు చేసే పార్కింగ్‌ స్థలాలను గురువారం పరిశీలించి, పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహిస్తామన్నారు. డీఎస్పీతో పాటు నలుగురు సీఐలు, 22 మంది ఎస్‌ఐలు, 450 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ భద్రతను కల్పిస్తామన్నారు. దుకాణాల వద్ద వాహనాలు నిలవకుండా చూడాలని, అనుమతులు లేకుండా జాతర ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలను రానివ్వొద్దన్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం 20 ఎకరాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. ట్రైనీ ఐపీఎస్‌ రాజేష్‌ మీనా, డీఎస్పీ ప్రకాష్‌, సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ లింగయ్య, పోలీసు సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు.

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

సూర్యాపేటక్రైం, జనవరి 11 : సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ రహదారిపై రద్దీ దృష్టా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రాహల్‌ హెగ్డే అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పండుగకు ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే వారితో రహదారులపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, జాతీయ రహదారి(65)పై ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అత్యవసర సమయంలో డయల్‌-100కు ఫోన చేసి సహాయం పొందాలన్నారు. ప్రధానంగా సూర్యాపేట రూరల్‌, చివ్వెంల, మునగాల, కోదాడ మండలాల పరిధిలోని రైతులు వ్యవసాయానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising