ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎక్సైజ్‌ ఎస్‌ఐపై బదిలీవేటు!

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:15 PM

: విధి నిర్వహణలో దుష్ప్రవర్తనతో వ్యవహరించిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పీఅండ్‌ఈఎ్‌సఐ బి.కోటేశ్వర్‌రావును రంగారెడ్డి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు అటాచ్‌ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు

వికారాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : విధి నిర్వహణలో దుష్ప్రవర్తనతో వ్యవహరించిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పీఅండ్‌ఈఎ్‌సఐ బి.కోటేశ్వర్‌రావును రంగారెడ్డి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు అటాచ్‌ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వికారాబాద్‌ సమీపంలోని గోధుమగూడలోని ఓ రిసార్ట్స్‌కు కోటేశ్వర్‌రావు తనిఖీల పేరిట వెళ్లారు. ఆ సమయంలో అక్కడ గెస్ట్‌రూముల్లో హైదరాబాద్‌ నుంచి కొందరు ఉన్నారు. గెస్ట్‌ రూముల్లోకి వెళ్లి అక్కడ ఉన్న వారి పట్ల కోటేశ్వర్‌రావు తనిఖీల పేరిట దురుసుగా, దుష్ప్రవర్తనతో వ్యవహరించారంటూ ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. ప్రాథమిక విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు కోటేశ్వర్‌రావును రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశిస్తూ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ ఈ.శ్రీధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జరిగిన సంఘటనపై విచారణ నిర్వహించి తనకు నివేదిక అందజేయాలని ఆయనను కమిషనర్‌ ఆదేశించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:15 PM

Advertising
Advertising