ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉప్పల మల్సూరు జీవితం ఆదర్శనీయం

ABN, Publish Date - Jan 13 , 2024 | 11:55 PM

సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పుల మల్సూరు జీవితం ఆదర్శనీయమని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న, కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ కిసాన సెల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ముదిరెడ్డి మధుసూదనరెడ్డి అన్నారు. శ

మల్సూరు విగ్రహం ఎదుట నివాళులర్పిస్తున్న గ్రామస్థులు

మోతె, జనవరి 13: సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పుల మల్సూరు జీవితం ఆదర్శనీయమని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న, కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ కిసాన సెల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ముదిరెడ్డి మధుసూదనరెడ్డి అన్నారు. శనివారం మల్సూరు 25వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం సిరికొండలో ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడారు. నిరుపేద కుటుంబంలో పుట్టి సూర్యాపేట నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన మహోన్నత వ్యక్తి మల్సూరు అన్నారు. ఆయన ఆశయాలను నేటి తరం నాయకులు, యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సిరికొండలో మల్సూరు విగ్రహాన్ని ముదిరెడ్డి మధుసూదనరెడ్డి ఏర్పాటుచేయించడం సంతోషకరమన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మల్సూరు విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందేలా చూస్తానని కిసానసెల్‌ నాయకుడు మధుసూదనరెడ్డి హామీఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ నజీర్‌, ఏపూరి సోమన్న, కాంపాటి శ్రీను, నందిగామ కృష్ణారెడ్డి, నూకల ఉపేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, వేల్పుల విజయ్‌ మల్సూరు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2024 | 11:55 PM

Advertising
Advertising