ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరు గ్యారంటీలనూ అమలు చేస్తాం

ABN, Publish Date - Jan 05 , 2024 | 11:05 PM

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలనూ ఖచ్చితంగా అమలు చేస్తుందని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు.

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు

ఇబ్రహీంపట్నం, జనవరి 5 : కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలనూ ఖచ్చితంగా అమలు చేస్తుందని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో మహిళా ప్రయాణికులతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం పట్ల వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఒక్కటైన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు వారికి త్వరలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, విద్యార్థినుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మహిళా లోకం నుంచి వస్తున్న ఆదరణకు బయపడి బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఆటోడ్రైవర్లను ఉసిగొల్పుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచిస్తుందని, వారికి సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, నాయకురాళ్లు సదాలక్ష్మి, కవిత, ఉషశ్రీ, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising