ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగులు కూడా కామెడీ చేస్తాయా.. ఈ మహిళను ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2021-12-19T00:40:40+05:30

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏనుగు మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. ఓ మహిళను ఆ ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో చూస్తే.. అరే, ఈ ఏనుగు చాలా వెరైటీగా ఉందే.. అని మీరే అంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని జంతువులు అచ్చం మనుషుల మాదిరే ప్రవర్తించడం చూస్తుంటాం. కోతులు, ఏనుగులు తదితర జంతువులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి సర్కస్‌లో వినూత్నంగా ఫీట్లు చేయించడం చూస్తూనే ఉంటాం. అలాంటి జంతువులను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంత పర్‌ఫెక్ట్‌గా విన్యాసాలు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏనుగు మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. ఓ మహిళను ఆ ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో చూస్తే.. అరే, ఈ ఏనుగు చాలా వెరైటీగా ఉందే.. అని మీరే అంటారు...


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ తల మీద టోపీ పెట్టుకుని నిలబడి ఉంటుంది. అంతలో ఓ ఏనుగు వెనుక వైపు నుంచి వస్తుంది. మహిళ తలపై ఉన్న టోపీని తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. దీంతో మహిళ షాక్ అయ్యి.. వెనక్కు తిరిగి చూస్తుంది. టోపీ ఏనుగు నోట్లోకి వెళ్లిపోవడం చూసి.. తినేసిందేమో అనుకుంటుంది. ఆమె అలా అనుకుంటూ ఉండగానే.. నోట్లోని టోపీని మళ్లీ బయటికి తీసి మహిళ చేతికి ఇస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆ మహిళ అవాక్కవుతుంది. ఏనుగు భలె కామెడీగా ఉందే.. అంటూ ఆమె నవ్వడం చూడొచ్చు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఏనుగు చాలా బాగా కామెడీ చేస్తుందే.. అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

ఈ చింపాంజీల తెలివి మామూలుగా లేదుగా.. కారును ఎంత శ్రద్ధగా శుభ్రం చేస్తున్నాయో చూడండి..



Updated Date - 2021-12-19T00:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising