తల్లి రెండో పెళ్లి గురించి ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పెట్టిన కూతురు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్
ABN, First Publish Date - 2021-12-18T22:30:37+05:30
ఓ తల్లి రెండో పెళ్లి చేసుకుంది. అయితే వారి కూతురు, 16ఏళ్ల కొడుకు మాత్రం తల్లికి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. పైగా తల్లి పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూతురు ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ..
పెళ్లి వయసు పిల్లలున్న తల్లి రెండో పెళ్లి చేసుకుంటుందంటే.. సాధారణంగా పిల్లలెవరూ ఒప్పుకోరు. ఎదిగొచ్చిన పిల్లలను పెట్టుకుని.. ఈ వయసులో రెండో పెళ్లి ఏంటని ఇరుగుపొరుగు వారు కూడా గుసగుసలాడుకోవడం సాధారణమే. అయితే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒక్కోసారి పిల్లల తల్లులు కూడా రెండో వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనే ఇటీవల జరిగింది. ఇద్దరు పిల్లలున్న ఓ తల్లి.. రెండో పెళ్లి చేసుకుంది. అయితే వారి కూతురు, 16ఏళ్ల కొడుకు మాత్రం తల్లికి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. పైగా తల్లి పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూతురు, ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ సంతోషాన్ని పంచుకుంది. ఈ అంశంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు...
కారణాలు ఏంటో తెలీకపోయినా ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పెళ్లి విషయం పిల్లలకు తెలిసినా వారు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. పైగా కూతురే స్వయంగా తల్లిని ముస్తాబు చేసింది. చేతులకు మెహందీ వేసి, పెళ్లికూతురుగా సిద్ధం చేసింది. పెళ్లిలో ప్రతి ఒక్క ఘట్టాన్ని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘అమ్మ పెళ్లి చేసుకుంటుందంటే నమ్మలేకపోతున్నా’’.. అంటూ క్యాప్షన్ పెడుతూనే మా తల్లి అభిప్రాయాన్ని 16ఏళ్ల తమ్ముడితో పాటూ నేనూ గౌరవిస్తున్నానంటూ ప్రస్తావించింది.
ప్రేమ పెళ్లికి పెద్దలు నో.. ఒప్పించేందుకు ఫ్రెండ్స్‌తో ఆ కుర్రాడు చెప్పించిన అబద్ధం.. ప్రేయసి ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే..
ఈ పోస్టు వైరల్ అవడంతో పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పిల్లలు చాలా గొప్ప మనసుతో తల్లి అభిప్రాయాన్ని గౌరవించడం అభినందనీయం.. అంటూ ఒకరు కామెంట్ పెడితే.. మీ తల్లి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని మరొకరు స్పందించారు. కొందరు మాత్రం ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
వృద్ధురాలైన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి.. మత్తులోకి వెళ్లాక ఈ కొడుకు చేసిన నీచమిది.. ఏం జరిగిందో ఆలస్యంగా ఆమె గ్రహించి..
Updated Date - 2021-12-18T22:30:37+05:30 IST