ప్రేమ పెళ్లికి పెద్దలు నో.. ఒప్పించేందుకు ఫ్రెండ్స్‌తో ఆ కుర్రాడు చెప్పించిన అబద్ధం.. ప్రేయసి ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2021-12-18T02:15:17+05:30
ప్రేమికులు కొత్త కొత్త ఐడియాలతో తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. బెంగళూరులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దక్కించుకోవడం కోసం ప్రేయసి కుటుంబ సభ్యులకు చెప్పిన అపద్ధం చివరకు ప్రియురాలి ప్రాణం తీసింది...
ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కొందరు ప్రేమికులు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరి ప్రయత్నాలు సఫలీకృతమవుతుంటే.. మరికొందరి ప్రయత్నాలు చివరకు బెడిసికొడుతుంటాయి. ప్రస్తుతం కొందరు ప్రేమికులు కొత్త కొత్త ఐడియాలతో తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. బెంగళూరులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దక్కించుకోవడం కోసం ప్రేయసి కుటుంబ సభ్యులకు చెప్పిన అపద్ధం చివరకు ప్రియురాలి ప్రాణం తీసింది. ఈ విషాధ ఘటన వివరాల్లోకి వెళితే..
కర్ణాటక హసన్ జిల్లాలోని చన్నారాయపట్నానికి చెందిన యువతి సాకమ్మ(24) యశ్వంత్పుర్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడే పని చేసే అరుణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న వారు.. అందరిలాగానే వీరు కూడా ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాకమ్మను ప్రేమిస్తున్నట్లు అరుణ్.. తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. మొదట వ్యతిరేకించినా.. కొన్నాళ్ల తర్వాత పెళ్లికి అంగీకరించారు. అయితే సాకమ్మ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
దుప్పట్లో చుట్టి.. పక్కన ఓ వాటర్ బాటిల్ పెట్టి.. రెండేళ్ల చిన్నారిని రాత్రిపూట బస్టాండ్‌లో వదిలేశారు.. చివరకు..
సాకమ్మను ఎలాగైనా పెళ్లిచేసుకోవాలని అరుణ్ వివిధ రకాలుగా ప్రయత్నించాడు. అయినా ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి అతనికి ఓ ఐడియా వచ్చింది. తన స్నేహితుడైన గోపాల్‌తో మాట్లాడి పక్కా ప్లాన్‌ను రూపొందించాడు. అందులో భాగంగా సాకమ్మ బావ ప్రజ్వల్‌కు గోపాల్ ఫోన్ చేశాడు. ‘‘ తాను పోలీసునని, పెళ్లికి అంగీకరించలేదనే ఆందోళనలో అరుణ్ ఆత్మహత్యాయత్నం చేశాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. పెళ్లికి ఒప్పుకోకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని’’.. హెచ్చరించాడు. దీంతో కంగారుపడిన ప్రజ్వల్.. ఈ విషయాన్ని సాకమ్మ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ విషయం తెలియగానే సాకమ్మ తీవ్ర మనస్థాపం చెందింది.
వృద్ధురాలైన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి.. మత్తులోకి వెళ్లాక ఈ కొడుకు చేసిన నీచమిది.. ఏం జరిగిందో ఆలస్యంగా ఆమె గ్రహించి..
అరుణ్ ఆత్మహత్యాయత్నం వార్త వినగానే.. తనకు దూరమవుతున్నాడని ఆందోళన చెందిన సాకమ్మ, మునేశ్వర లేఅవుట్లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘‘అరుణ్‌తో పెళ్లికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, అరుణ్ లేని జీవితం తనకు అవసరం లేదని’’.. లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాకమ్మ ఆత్మహత్యకు కారణమైన అరుణ్, గోపాల్‌ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.
బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా..
Updated Date - 2021-12-18T02:15:17+05:30 IST