ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. వెతికి పట్టుకున్న తర్వాత ఆమె చెప్పిన నిజాలు విని పోలీసులకు షాక్..

ABN, First Publish Date - 2021-09-13T23:51:18+05:30

కూతురి తప్పిపోయిందంటూ తండ్రి ఫిర్యాదు.. దర్యాప్తులో వెలుగులోకి వచ్చి షాకింగ్ వాస్తవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  ఓ రాత్రి అకస్మాత్తుగా ఆ ఇల్లాలు ఇంటి నుంచి వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూ తన వెంట పిల్లాడిని కూడా తీసుకెళ్లింది. జులై 1న జరిగిందీ ఘటన. దీంతో ఆమె భర్తకు ఊహించని షాక్ తగిలింది. ఆమె కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో అతడు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు.. మహిళ తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లుడే  ఏదో చేసి ఉంటాడంటూ అనుమానం వ్యక్తం చేశాడు.


ఆ తరువాత.. రంగంలోకి దిగిన పోలీసులు ఇటీవలే మహిళ ఆచూకీ కనిపెట్టారు. ఈ క్రమంలో గత ఏడేళ్లుగా తండ్రి గురించి ఆమె చెప్పిన విషయాలు  విని పోలీసులే షాకైపోయారు. చివరికి తండ్రిపైనే పోలీసు కేసు నమోదైంది. హరియాణా రాష్ట్రం హిసార్ జిల్లాలో జరిగిన దారుణం ప్రస్తుతం వైరల్‌గా మారింది. 


భర్త కారణంగా ఆమె పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తే..బాధితురాలు మాత్రం తండ్రిపైనే కేసు పెట్టింది. 2013లో ఆమెకు 15 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి తొలిసారిగా అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసుల ముందు వాపోయింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ తండ్రి బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న నిందితుడు..కన్నకూతురిపై పలు మార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఓ మారు ఆమె తల్లికి చెబితే... ఆమె తన భర్తను నిలదీసింది. 

ఇవీ చదవండి: 
ఆమెకు డబ్బులు అవసరం! అతడేమో ఇంటికొస్తే అప్పు ఇస్తానన్నాడు.. సరేనని వెళ్లిన ఆ మహిళకు..
భార్యపై అనుమానం.. స్నేహితుల ముందే ఆమెను నడి రోడ్డుపై.. ఓ భర్త చేసిన నీచమిది..!


అయితే.. ఆత్మహత్య చేసుకుంటానంటూ నిందితుడు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో..ఏం జరుగుతుందోనని తల్లి భయపడిపోయింది. తల్లి ఆవేదన చూసిన బాధితురాలు మరోమారు మౌనాన్నే ఆశ్రయించింది. ఆ తరువాత.. 2016లో ఆమెకు వివాహం జరిగి అత్తారింటికి వెళ్లిపోయింది. కూతురికి పెళ్లైనా కూడా తండ్రి బుద్ధి మాత్రం మారలేదు. తల్లిని చూసేందుకు ఆమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా  ఆమెవైపు దుర్బుద్ధితో చూస్తుండేవాడు. మరోవైపు.. అత్తారింట్లోనూ బాధితురాలు తండ్రి నుంచి వేధింపులు ఎదుర్కోసాగింది.

ఈ క్రమంలో ఓ రోజు ఆమె తన బిడ్డను తీసుకుని ఇంట్లోంచి పారిపోయింది. ఆమె నోయిడాలో ఉంటున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆమెను వెనక్కితీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-09-13T23:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising