ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి ఒడిలో కూర్చుని హాయిగా ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. ఇంతలోనే సడన్‌గా దూసుకొచ్చిన తూటా.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-12-11T22:18:31+05:30

మృత్యువు ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఎవరమూ చెప్పలేం. అస్సాంలో ఓ విషాధ ఘటన జరిగింది. తల్లి ఒడిలో హాయిగా సేదతీరుతున్న చిన్నారి.. అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుందని.. ఎవరూ ఊహించలేదు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృత్యువు ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఎవరమూ చెప్పలేం. అస్సాంలో ఓ విషాధ ఘటన జరిగింది. తల్లి ఒడిలో హాయిగా సేదతీరుతున్న చిన్నారి.. అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుందని.. ఎవరూ ఊహించలేదు. కానీ విధి మాత్రం ఆ చిన్నారిపై చిన్నచూపు చూసింది. కళ్లు కూడా తెరవని ఆ చిన్నారిని.. కాసేపట్లో తూటాలు కబలిస్తాయని.. ఆ తల్లి కలలో కూడా ఊహించి ఉండదు. లేదంటే ఆ తూటాలకు తానే అడ్డుపడి పాపను రక్షించుకునేది. అసలు ఏం జరిగిందంటే..


అస్సాంలోని కామరూప్ జిల్లా బోకో పరిధి.. బోండపారా ప్రాంతం అడవికి దగ్గరగా ఉంటుంది. దీంతో ఇటీవల ఆ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువైంది. పంటలను నాశనం చేయడంతో పాటూ మనుషులను కూడా గాయపరిచేవి. వాటి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ఏనుగుల బెడదను తప్పించాలని స్థానికుల నుంచి రోజూ అటవీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లేవి. స్పందించిన అధికారులు ఏనుగులను తరిమికొట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో వాటిని బెదిరించడానికి తుపాకీతో కాల్పులు జరిపారు. రోజూ లాగే గురువారం రాత్రి కూడా అటవీ సిబ్బంది కాల్పులు జరపడం ప్రారంభించారు.

పొలంలో కనిపించినవి పిల్లి కూనలే అనుకుని పులి పిల్లలను ఇంటికి తెచ్చిన రైతు.. రోజూ పాలు పోసి, స్నానం చేయించేవాడు.. చివరకు..


అదే సమయంలో గ్రామంలో ఇంటి బయట ఓ తల్లి తన పాపను ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తోంది. తుపాకి తూటా తమవైపు వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. కానీ ప్రమాదవశాత్తు ఓ తూటా వేగంగా వారి వైపే దూసుకొచ్చి.. చిన్నారి శరీరాన్ని తాకింది. దీంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం గౌహతిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి పరిస్థితి విషయంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ఈ ఘటనతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి.

బాధపడుతూ ఇంటికొచ్చిన తండ్రి.. ఏమైంది నాన్నా.. అంటూ కంగారుగా అడిగిన కూతురు.. విషయం తెలుసుకుని టీ దుకాణానానికి వెళ్లి..

Updated Date - 2021-12-11T22:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising