ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.7499 విలువైన Geyser ను అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే.. పార్శిల్లో వచ్చిన వాటిని చూసి అవాక్కైన కస్టమర్

ABN, First Publish Date - 2021-12-17T00:20:33+05:30

ఒక్కోసారి మనం ఒక వస్తువు కోసం ఆర్డర్ చేస్తే.. వేరే వస్తువులు డెలివరీ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో అవాక్కవడం.. కస్టమర్ల వంతవుతుంది. కోల్‌కతాలో ఓ వ్యక్తి రూ.7499 విలువ గల Geyser కోసం ఆర్డర్ చేస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం షాపింగ్ చేసేవారు ఎక్కువ శాతం ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతుంటారు. సెల్‌లో ఒక్క క్లిక్‌తో అనుకున్న వస్తువు.. ఇంట్లోకి వచ్చి చేరుతుండడంతో ఎక్కవ మంది ఇదే పద్ధతిని అనుసరిస్తుంటారు. అయితే ఇలా ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేసే క్రమంలో చాలా మోసాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం ఒక వస్తువు కోసం ఆర్డర్ చేస్తే.. వేరే వస్తువులు డెలివరీ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో అవాక్కవడం.. కస్టమర్ల వంతవుతుంది. కోల్‌కతాలో ఓ వ్యక్తి రూ.7499 విలువ గల Geyser కోసం ఆర్డర్ చేస్తే.. తీరా అతడికి వచ్చిన వస్తువులను చూసి షాక్ అయ్యాడు...


కోల్‌కతాకు చెందిన సయన్ మజుందార్ వృత్తిరీత్యా న్యాయ నిపుణులు. డిసెంబర్ 9న రూ.7,499 విలువ గల గీజర్ కోసం ఆమెజాన్‌లో ఆర్డర్ చేశాడు. అనంతరం వచ్చిన బాక్స్‌ను ఇంట్లో పెట్టారు. గీజర్‌ను అమర్చడానికి బుధవారం ఎలక్ట్రీషియన్ రావడంతో పార్సిల్‌ను తెరిచారు. అయితే ఆ బాక్సులో గీజర్‌కు బదులుగా మ్యాగీ ప్యాకెట్లు, డిటర్జెంట్ బాటిళ్లతో కూడిన కార్టన్‌ ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. అనంతరం దాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేసి, అమెజాన్ ఇండియా, ఇంటర్నెట్ దిగ్గజం చీఫ్ జెఫ్ బెజోస్‌‌కు ట్యాగ్ చేశాడు.

నా భర్త నన్ను తిట్టాడు.. అంటూ పెళ్లయిన ఎనిమిదో రోజే ప్రియుడికి ఫోన్ చేసి చెప్పిందో భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


మజుందార్ ఫిర్యాదును పరిశీలించిన అమెజాన్ హెల్ప్ డెస్క్.. పూర్తి వివారాలు అందించాలని సూచించింది. అనంతరం ఏజెంట్‌ అతడికి ఫోన్ చేసి, గీజర్‌ను పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చాడు. అక్టోబర్‌లో కేరళకు చెందిన ఓ వ్యక్తి అమెజాన్‌లో ఐఫోన్‌ను ఆర్డర్ చేయగా.. సబ్బులు, 5రూపాయల నాణెం రావడంతో షాక్ అయ్యాడు. అలాగే గతేడాది జూన్‌లో పూణేకు చెందిన గౌతం అనే వ్యక్తి రూ.300 విలువ చేసే లోషన్‌ను ఆర్డర్ చేయగా.. రూ.19,000 విలువైన ఇయర్‌ఫోన్‌లు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన భార్య.. వెనుకే గమనిస్తూ వెళ్లిన భర్త.. అక్కడ ఇద్దరినీ చూసి..



Updated Date - 2021-12-17T00:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising