ఛీ..ఛీ.. అనుకుంటూ అంతా ముక్కుమూసుకునే ‘ఆ గాలి’తోనే లక్షలు సంపాదిస్తున్న యువతి..!
ABN, First Publish Date - 2021-12-16T21:37:18+05:30
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ టీవీ స్టార్‌కు వింత ఆలోచన వచ్చింది. అంతా ఛీ.. ఛీ.. అనుకుంటూ ముక్కు మూసుకునే ఆ గాలి(అపానవాయువు)తోనే లక్షలు సాంపాదిస్తోంది. వివరాల్లోకి వెళితే..
డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలుంటాయి. కొందరు కష్టపడి సంపాదిస్తే.. మరికొందరు తమ తెలివితేటలను ఉపయోగించి లక్షలకు లక్షలు సంపాదిస్తుంటారు. ఇక సెలబ్రిటీల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులకు కూడా లక్షల్లో డిమాండ్ ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. కొందరు తమ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ టీవీ స్టార్‌కు వింత ఆలోచన వచ్చింది. అంతా ఛీ.. ఛీ.. అనుకుంటూ ముక్కు మూసుకునే ఆ గాలి(అపానవాయువు)తోనే లక్షలు సాంపాదిస్తోంది. వివరాల్లోకి వెళితే..
స్టెఫానీ మట్లో అనే ఓ టీవీ నటికి.. 90డే ఫియాన్స్ అనే కార్యక్రమం ద్వారా మంచి పేరు వచ్చింది. దీంతో అభిమానులు పెరిగిపోయారు. కొత్తగా ఆలోచించడం ద్వారా డబ్బు సంపాదించాలని నిత్యం ఆలోచిస్తూ ఉండేది. తనకు ఎలాగూ అభిమానులు ఉన్నారు కాబట్టి.. ఎవరూ చేయని విధంగా తన అపానవాయువును అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టింది. ఇంకేముంది తన అభిమానుల నుంచి ఆర్డర్లు విపరీతంగా వచ్చిపడ్డాయి. వారానికి ఏకంగా 70వేల డాలర్లు (రూ.37లక్షలు) సంపాదిస్తోంది.
డప్పుల మోతలకు అదిరిపోయే స్టెప్పులు.. వైరల్‌గా మారిన మహిళల డాన్స్ వీడియో
గాజు సీసాలో అన అపానవాయువును నింపి, ఒక్కో యూనిట్ రూ.1400డాలర్లకు(సుమారు రూ.75వేలు) విక్రయిస్తోంది. ఆ గాలి కూడా స్వచ్ఛంగా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. తాజా ఆకుకూరలు, గుడ్లు తదితర ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటున్నట్లు చెబుతోంది. అదేవిధంగా అపానవాయువును నింపే సీసాలో పూల రేకులు పెడుతున్నానని, తద్వారా ఆ గాలి మరింత సువానగా ఉంటుందని తెలిపింది. రెండు రోజుల్లోనే ఆమె ఏకంగా 90జార్లు అమ్మేసిందట. తన అభిమానులకు గాజు సీసాతో పాటూ ఓ లెటర్‌ను కూడా పంపిస్తుంది. దీంతో తమ అభిమాన తార అపానవాయువు కోసం ఎగబడుతున్నారట.
అర్ధరాత్రి రైల్లోని మహిళా బోగీలో బ్యాగు కలకలం.. ప్రయాణికులతో పాటూ పోలీసులూ షాక్.. తీరా సంచి తెరిచి చూడగా..
Updated Date - 2021-12-16T21:37:18+05:30 IST