ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియుడితో వెళ్లిపోయిన 18 ఏళ్ల యువతి.. పోలీసులు వెతికి పట్టుకుని రైల్లో తీసుకొస్తుండగా ఊహించని పరిణామం..!

ABN, First Publish Date - 2021-09-15T04:52:43+05:30

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ యువ జంట షాకింగ్ నిర్ణయం.. చివరికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 27 ఏళ్లు..ఆమెకు 18. అతడికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలకు కూడా ఉన్నారు. అయితే.. భార్య చనిపోయాక అతడు యువతి ప్రేమలో పడ్డాడు. మొదట్లో వాళ్లు ఉత్తరప్రదేశ్‌లో ఉండేవారు. కానీ.. గతేడాది వారు ఎవరికీ చెప్పకుండా మహారాష్ట్రకు వచ్చి కాపురం పెట్టారు. ఈ క్రమంలో.. వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. వీరి కోసం వెతకడం ప్రారంభించారు. థానేలో వారు ఉన్నట్టు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీంతో.. ఓ ప్రత్యేక పోలీస్ బృందం వారిని అదుపులోకి తీసుకుని వెనక్కు తీసుకొచ్చింది.

ఇదీ చదవండి
బంగారం కొనడానికి వచ్చిన మహిళలు.. నచ్చలేదంటూ వెళ్లిన తర్వాత అనుమానం.. సీసీ కెమెరాను చెక్ చేస్తే..
మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. రాత్రి చిన్న గొడవ.. వేరు వేరుగా పడుకున్నారు.. తెల్లవారుజామున భర్త గదిలోకి వెళ్లి చూస్తే.


సెప్టెంబర్ 10న పోలీసు బృందం ఆ జంటను తీసుకుని యూపీకి బయలు దేరింది. ఈ క్రమంలో పోలీసులు చిన్న కునుకు తీశారు. అదే అదనుగా..ఆ జంట ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. కదులుతూ ఉన్న రైల్లో నుంచి దూకేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ.. రైలు అమితమైన వేగంతో వెళుతుండంతో కిందకు దూకిన యువతి అక్కడిక్కడే మరణించింది. యువకుడు మాత్రం తీవ్రగాయాలపాలయ్యాడు. లలిత్‌పూర్‌లో ఈ ఘటన జరగ్గా.. రైలు ఝాన్సీ వెళ్లేవరకూ పోలీసులకు మెళకువ రాలేదు. వారు నిద్రలేచే సరికే జరగవలసిన దారుణం జరిగింది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే రైల్వే పోలీసులు..అపస్మారక స్థితిలో పడిఉన్న జంటను ఆస్పత్రికి తరలించారు. యువతి అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. యువకుడి పరిస్థితి మాత్రం ఆందోళన కరంగా ఉంది. ఆ యువతీయువకులను వెయ్యికళ్లతో గమనించాల్సింది పోయి..కునుకు తీసిన ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

Updated Date - 2021-09-15T04:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising