ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్లో వెళ్తున్న ఓ ప్రయాణికుడికి సడన్‌గా గుండెపోటు.. తల్లిని తీసుకెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చిన ఓ యువతి చూసి..

ABN, First Publish Date - 2021-12-10T03:15:37+05:30

రైల్లో భార్యా, పిల్లలతో కలిసి సంతోషంగా ప్రయాణిస్తున్న సమయంలో అతడికి సడన్‌గా గుండెపోటు వచ్చింది. స్టేషన్ దిగగానే కుప్పకూలిపోయాడు. ఇక తన జీవితం ముగిసిందనుకునే సమయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆపదలో ఉన్న సమయంలో చిన్న సాయం కూడా జీవితాంతం రుణపడేలా చేస్తుంది. అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో ఎవరైనా ఆదుకుంటే.. సమయానికి దేవుడిలా వచ్చారని.. కొనియాడుతుంటాం. ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. రైల్లో భార్యా, పిల్లలతో కలిసి సంతోషంగా ప్రయాణిస్తున్న సమయంలో అతడికి సడన్‌గా గుండెపోటు వచ్చింది. స్టేషన్ దిగగానే కుప్పకూలిపోయాడు. ఇక తన జీవితం ముగిసిందనుకునే సమయంలో ఓ యువతి అతన్ని గమనించింది. ఆమె తీసుకున్న నిర్ణయంపై ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ భోపాల్ పరిధి ఖాండ్వా ప్రాంతానికి చెందిన విజయ్ మసాని(38) వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్. ఇతడికి భార్య మనీషా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యకు బీఈడీ అడ్మిషన్‌ ఉండడంతో మంగళవారం భోపాల్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని.. పంజాబ్ మెయిల్ ద్వారా బుధవారం ఉదయం రాణి కమలాపతి స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ప్రయాణం మధ్యలో ఒకసారి గుండెలో నొప్పిగా అనిపించింది. స్టేషన్ దిగగానే మళ్లీ ఒక్కసారిగా నొప్పి ఎక్కువైంది. దీంతో అక్కడికక్కడే కళ్లు తిరిగి పడిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ జవాన్ దీపక్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ ఓజా, కానిస్టేబుల్ ఇందర్ సింగ్ యాదవ్.. అతడి ఛాతిపై నొక్కుతూ సీపీఆర్ చేశారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వారికి ఏం చేయాలో తోచలేదు. ఇంకోవైపు అతడి పరిస్థితి విషమిస్తోంది. అంతా ఆందోళనలో ఉండగా.. ఓ యువతి అక్కడికి చేరుకుంది.

బీటెక్ పూర్తి కాకుండానే రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఆర్మీలో చేరాలన్న మక్కువతో రిజెక్ట్ చేసి మరీ..


అనుప్పూర్ జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్‌సి సింగ్ బిసెన్ కుమార్తె జయ సింగ్.. తన తల్లిని తీసుకురావడానికి అదే సమయంలో స్టేషన్‌కు చేరుకుంది. మాసాని పరిస్థితి గమనించిన ఆమె.. వారి వద్దకు వెళ్లి విషయం తెలుసుకుంది. వెంటనే సైనికుడు, పోలీసుల సాయంతో విజయ్‌ని తన కారులో ఎక్కించుకుని సమీంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చింది. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడంతో అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. మానవత్వంతో స్పందించి విజయ్ ప్రాణాలను కాపాడిన యువతిని.. స్థానికులంతా పొగడ్తలతో ముంచెత్తారు. దేవుడే ఆమె రూపంలో వచ్చి తన భర్తను కాపాడాడంటూ విజయ్ భార్య సంతోషం వ్యక్తం చేసింది.

బుడ్డోడే కానీ.. భలే మంచి పని చేశాడు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..

Updated Date - 2021-12-10T03:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising