అర్ధరాత్రి కూతురి గదిలోకి వెళ్లి చూసిన తల్లి.. కళ్లెదురుగా భయానక దృశ్యం! తండ్రిపై కోపంతో ఓ కూతురి అనూహ్య నిర్ణయం!
ABN, First Publish Date - 2021-09-12T23:24:59+05:30
తండ్రిపై కోపంతో ఓ కూతురి షాకింగ్ నిర్ణయం.. అర్థరాత్రి వేళ తల్లికి భారీ షాక్
ఇంటర్నెట్ డెస్క్: వారిది చిన్న కుటుంబం. ఆ దంపతులకు ఓ కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురి వయసు 24 ఏళ్లు. వాళ్లుండేది భోపాల్‌లో.యువతి తల్లేమో నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. తండ్రేమో రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ అప్పుడప్పుడూ వారి చూసి వెళుతుంటారు. ఇటీవల వారి ఇంటికి చుట్టంచూపుగా మేనల్లుడు వచ్చాడు. ఆ రోజు రాత్రి అందరూ భోజనాలకు కూర్చుకున్నారు. రైలు టిక్కెట్ల విషయంలో వారి మధ్య మరోమారు రభస జరిగింది. తండ్రి రైల్వేలో పనిచేస్తుండటంతో.. కజిన్‌కు రైలు టిక్కెట్లు తెచ్చిపెట్టమని మూడు రోజుల నుంచీ ఆయనను కూతురు అడుగుతోంది. ఆయనకు అది సాధ్యం కాలేదు. దీంతో..ఆ రాత్రి ఆమె అలిగి తన గదిలోకి వెళ్లిపోయింది. ఆ రాత్రి సుమారు 2.30కు ఆమె తల్లి కూతురి గదిలోకి వెళ్లి చూసి..అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైపోయింది. ఫ్యాను నుంచి వేళాడుతున్న కూతురి శవం చూసి ఆమెకు నోట మాటరాలేదు.
ఇవీ చదవండి
ఆమెకు డబ్బులు అవసరం! అతడేమో ఇంటికొస్తే అప్పు ఇస్తానన్నాడు.. సరేనని వెళ్లిన ఆ మహిళకు..
విచిత్ర శబ్దాలు.. స్టేషన్‌లో ఆగిపోయిన రైలు! ఇంజన్ వద్దకు వెళ్లి చూస్తే కంటపడిన షాకింగ్ దృశ్యం!
కూతురు ఇలా అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి రోహతాష్ భట్నానగర్, తల్లి ప్రేమలత కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంలో మూడు రోజులుగా ఆమె తమతో గొడవపడుతోందని ఆయన పోలీసులకు తెలిపారు. తనపై కోపంతో మాట్లాడటం కూడా మానేసిందని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే.. ఇదో మానసిక సమస్య అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడేవారిలో అనేక మంది డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సతమతమవుతుంటారట. ఆధునిక జీవనశైలి కారణంలో యువతలో చిన్న విషయాలకే ఆసంతృప్తి మొదలవుతోందని, చూస్తుండగానే ఇది తీవ్ర రూపం దాల్చి దారుణ పరిణామాలకు దారితీస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2021-09-12T23:24:59+05:30 IST