ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kalva Srinivasulu: జగన్ అండ చూసుకునే చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2022-11-27T12:28:52+05:30

ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా మట్టుబెట్టాలనుకున్నారని, సీఎం జగన్ (CM Jagan) అండ చూసుకునే చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా మట్టుబెట్టాలనుకున్నారని, సీఎం జగన్ (CM Jagan) అండ చూసుకునే చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్‌ (Nara Lokesh) టార్గెట్‌ అని చెప్పినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. చంద్రశేఖర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలను ఒక్క మాట అంటే అరెస్టులు చేస్తారని.. చంద్రబాబు, లోకేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అరెస్టు చేయలేదంటే ఏమనాలన్నారు. పోలీసులు ఏపపక్షంగా వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యర్థులను భౌతికంగా మట్టుబెట్టాలని ఆనాడు వైఎస్ సర్కార్ ప్రయత్నించిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. పరిటాల రవి హత్య కేసులో వైఎస్ హస్తం ఉందని చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలతో నిరూపితమైందన్నారు. వైఎస్ కుట్రలతోనే పరిటాల రవి హత్య జరిగిందన్నారు. మళ్లీ హత్యా రాజకీయాలు జరిగితే లోకేష్ టార్గెట్‌ అని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారన్నారు. ప్రతిపక్షాలు, మీడియాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వైసీపీ నేతలు సైకోలా తయారయ్యారని, జగన్ నేరపూరితమైన రాజకీయాలకు వీరంతా ఊతమిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల తీరు చాలా ప్రమాదకరమని, వైసీపీ నేతల తీరుతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారన్నారు. తమ కళ్లముందే వైసీపీ నేతలు చెలరేగిపోతుంటే పోలీసులు మిన్నకుండిపోతున్నారని కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-27T12:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising