YCP: జీవీఎల్‌కు వైసీపీ మంత్రి సవాల్
ABN, First Publish Date - 2022-12-28T17:14:19+05:30
విభజన హామీలు సహా కేంద్రం ఇవ్వాల్సిన ప్రాజెక్ట్‌లపై జీవీఎల్‌తో చర్చకు తాను సిద్ధమని మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు.
విశాఖ: విభజన హామీలు సహా కేంద్రం ఇవ్వాల్సిన ప్రాజెక్ట్‌లపై జీవీఎల్ (GVL)తో చర్చకు తాను సిద్ధమని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) సవాల్ విసిరారు. జీవీఎల్ తెగిన గాలిపటం లాంటివారని విమర్శించారు. జీవీఎల్‌ను బీజేపీ నేతగా వాళ్ల పార్టీనే గుర్తించట్లేదన్నారు. 2024 తర్వాత జీవీఎల్ ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. జగదాంబ సెంటర్‌లో వదిలేస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని జీవీఎల్.. తనకు ఉన్న ఐటీ అవగాహనపై మాట్లాడుతున్నారా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.
Updated Date - 2022-12-28T17:14:21+05:30 IST