‘పోలవరం ప్రాజెక్టు.. 15 అంశాలపై చర్చించాం’
ABN, First Publish Date - 2022-11-16T19:19:48+05:30
పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీలో 15 అంశాలపై చర్చించినట్లు ఏపీ ఈఎన్సీ శశిభూషణ్ తెలిపారు. వరదలతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందన్నారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీలో 15 అంశాలపై చర్చించినట్లు ఏపీ ఈఎన్సీ శశిభూషణ్ తెలిపారు. వరదలతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందన్నారు. 2023 జూన్ లోపు పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు కాపర్ డ్యామ్ పనులు జనవరి చివరి నాటికి పూర్తవుతాయన్నారు. 2023 డిసెంబర్ నాటికి పోలవరం పనులు కొలిక్కి వస్తాయని తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్‌పై ఉమ్మడి సర్వే అనేది ఉండదన్నారు. అన్ని అంశాలపై ఆమోదం వచ్చాకే.. కేంద్రం, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఇప్పుడు అభ్యంతరాలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. పోలవరం ముంపు భూసేకరణ పెండింగ్‌లో ఉందన్నారు.
Updated Date - 2022-11-16T19:19:50+05:30 IST