రఘురామ ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై స్పందన
ABN, First Publish Date - 2022-11-15T17:23:38+05:30
ఎంపీ రఘురామ (Raghu Rama Krishnam Raju) ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై స్పీకర్ కార్యాలయం స్పందించింది.
ఢిల్లీ: ఎంపీ రఘురామ (Raghu Rama Krishnam Raju) ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌పై స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు. తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దాంతో రఘురామ ఫిర్యాదును కేంద్ర హోంశాఖకు స్పీకర్ కార్యాలయం పంపింది. దర్యాప్తు చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న లోక్‌సభ స్పీకర్ కార్యాలయం కోరింది.
Updated Date - 2022-11-15T17:23:42+05:30 IST