రైతులు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా?: బోండా ఉమ
ABN, First Publish Date - 2022-10-22T19:03:30+05:30
అమరావతి పాదయాత్రతో వైసీపీలో వణుకు పుట్టిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ (Bonda Uma) పేర్కొన్నారు. రైతులను చూస్తే సీఎం జగన్ (CM Jagan)కు భయం వేస్తోందన్నారు.
Amaravathi : అమరావతి పాదయాత్రతో వైసీపీలో వణుకు పుట్టిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ (Bonda Uma) పేర్కొన్నారు. రైతులను చూస్తే సీఎం జగన్ (CM Jagan)కు భయం వేస్తోందన్నారు. అందుకే అమరావతి పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఇంకా బోండా మాట్లాడుతూ.. ‘‘గతంలో వైఎస్, చంద్రబాబు (Chandrababu), జగన్ (Jagan) పాదయాత్రలు శాంతియుతంగా జరగలేదా? ఇప్పుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర శాంతి యుతంగా జరగడం లేదా? తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను పాటించే ప్రతి పోలీసు అధికారిని టీడీపీ (TDP) వదిలిపెట్టదు. ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడంతో పాటు సర్వీస్ రిమార్కులు వేయిస్తాం. శాంతి యుతంగా పాదయాత్ర జరుగుతుంటే వైసీపీ ప్రజా ప్రతినిధులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. మహిళా రైతులను పోలీసులు బూటుకాళ్ళతో తన్నడం ఏంటి? రైతులు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా? ఎంపీ భరత్, మంత్రులు రైతుల మీద దాడి చేయిస్తారా? మీరంతా మనుషులా, మృగాలా? మీ ఇళ్లళ్లో ఆడవాళ్లు లేరా? హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించరా? పడిపోయే ప్రభుత్వం మాటలు విని చట్ట విరుద్దంగా వ్యవహరిస్తే పోలీసులపై చర్యలు తప్పవు’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2022-10-22T19:03:33+05:30 IST