Aruna Miller: అరుణా మిల్లర్ ఎంపికపై చంద్రబాబు హర్షం
ABN, First Publish Date - 2022-11-10T20:19:12+05:30
అమెరికాలో లెఫ్టెనెంట్ గవర్నర్గా తెలుగు బిడ్డ అరుణా మిల్లర్ ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. మేరీలాండ్ లెఫ్టెనెంట్ గవర్నర్గా అరుణా ఎంపికపై అభినందనలు తెలిపారు.
అమరావతి: అమెరికాలో లెఫ్టెనెంట్ గవర్నర్గా తెలుగు బిడ్డ అరుణా మిల్లర్ ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. మేరీలాండ్ లెఫ్టెనెంట్ గవర్నర్గా అరుణా ఎంపికపై అభినందనలు తెలిపారు. అరుణామిల్లర్కు చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తెలుగు మహిళ అగ్రరాజ్యం అమెరికాలో రికార్డు సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగిన 58ఏళ్ల అరుణా మిల్లర్(Aruna Miller) మేరీలాండ్ లెఫ్టెనెంట్ గవర్నర్(Lt Governor Of Maryland)గా ఎన్నికయ్యారు. దీంతో అమెరికాలో లెఫ్టెనెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో మేరీలాండ్ గవర్నర్ పదవికి డెమోక్రటిక్ నేత వెస్ మూర్.. పోటీ చేయగా లెఫ్టెనెంట్ పదవికి అరుణా మిల్లర్ పోటీ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ విజయం సాధించారు. ఎన్నికల సందర్భంగా వీళ్ల గెలుపు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షరాలు కమలా హారిస్ ప్రచారానికి దిగారు. ఇదిలా ఉంటే.. అరుణా మిల్లర్ హైదరాబాద్‌లోనే జన్మించినప్పటికీ ఏడేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలసి 1972లో అమెరికాకు వెళ్లారు.
Updated Date - 2022-11-10T20:19:14+05:30 IST