ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడిని విధుల నుంచి తొలగింపు

ABN, First Publish Date - 2022-10-30T18:53:45+05:30

చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వెండి విభూది పట్టి మాయమైన వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్ గురుకుల్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమో జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వెండి విభూది పట్టి మాయమైన వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్ గురుకుల్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమో జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి భక్తులు వారి స్తోమతను బట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలను విరాళంగా ఇస్తారు. ఈ ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాక ఆలయం పునఃనిర్మాణం పూర్తయ్యాక ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని ఓ దాత విరాళంగా ఇచ్చారు. దీని విలువ రూ. 18 లక్షలు. ఈ విభూది పట్టీ ఈ ఏడాది ఆగస్టు 21 వ తేదీన కుంభాభిషేకం సందర్భంగా స్వామి వారికి అలంకరించారు. ఆ రోజు నుంచి అది కనిపించడం లేదు. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కాని భూది పట్టీని విరాళంగా ఇచ్చిన దాత తనకు రశీదు ఇవ్వలేదని అధికారులను సంప్రదించడంతో పట్టీ కనిపించడం లేదన్న విషయం బయటకు తెలిసింది. దీంతో ఆ ఆభరణం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఇంతలో గత 45 రోజులుగా కనిపించని ఆ ఆభరణం ఆలయ యోగశాలలో ప్రత్యక్షమైంది.

Updated Date - 2022-10-30T18:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising