ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో జగ్గారెడ్డి.. చాలా క్లాస్‌గా ఉన్నారు సార్‌ అంటూ కితాబు

ABN, First Publish Date - 2022-11-12T21:37:07+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) ఉన్నారు. నిత్యం పొడవైన జుట్టు, గడ్డంతో కనిపించే ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం తిరుమల (Tirumala)లో గుండుతో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు వచ్చిన ఆయన సాయంత్రం కల్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించారు. ఏడాదిలో ఓసారి మాత్రమే జగ్గారెడ్డి ఇలా క్లీన్‌షేవ్‌, గుండుతో కనిపిస్తుంటారని ఆయన అనుచరులు మీడియాకు తెలిపారు. ఆలయం వెలుపల జగ్గారెడ్డిని చూసిన చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. జగ్గారెడ్డి అని తెలుసుకున్న తర్వాత దగ్గరకు వెళ్లి చాలా క్లాస్‌గా ఉన్నారు సార్‌ అంటూ కితాబిచ్చారు.

తిరుమలలో వర్షం

తిరుమలలో మూడు రోజులుగా అప్పుడప్పుడూ వర్షం (Rain) కురుస్తూనే వుంది. రెండవ శనివారం, ఆదివారం వరుస సెలవులు కావడంతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి దాదాపు 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. ఈక్రమంలో తమకు కేటాయించిన దర్శన స్లాట్ల సమయం మించిపోకూడదని భక్తులు చిరుజల్లుల్లోనే తడుస్తూ దర్శనానికి వెళ్లి వస్తున్నారు.చలితీవ్రత పెరగడంతో దర్శనం తర్వాత చాలామంది భక్తులు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతున్నారు.వరుస వర్షాల కారణంగా పలు సందర్భాల్లో దట్టమైన పొగమంచుతో తిరుమల పుణ్యక్షేత్రం కనువిందు చేస్తోంది.దర్శనానికి వచ్చిన చాలా మంది భక్తుల పొగమంచు అందాల్లో ఫొటోలు తీసుకోవడంలో మునిగిపోయారు. ప్రత్యేకించి శనివారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు అధిక సమయం దట్టమైన పొగమంచుతోనే తిరుమల క్షేత్రం దర్శనమిచ్చింది.

Updated Date - 2022-11-12T21:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising