ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High court: చింతకాయల విజయ్ కేసులో తొందరపాటు చర్యలొద్దు

ABN, First Publish Date - 2022-10-27T17:27:50+05:30

అమరావతి: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కేసులో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత పోస్టు పెట్టిన వ్యవహారంలో ఏపీసీఐడీ పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కేసులో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత పోస్టు పెట్టిన వ్యవహారంలో ఏపీసీఐడీ పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న విజయ్‌‌కు మరోసారి సీఐడీ పోలీసులు 41(A) నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి నోటీసు అంటించారు. ఈ నోటీసును విజయ్ తరపు న్యాయవాది హైకోర్టులో సవాల్ చేశారు. గురువారం న్యాయమూర్తి ముందు విజయ్ తరపు న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ నివాసం నర్సీపట్నంలో ఉంటే హైదరాబాద్‌లో నోటీసులు ఇవ్వడం‌పై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఐటీడీపీ కోసం ఉపయోగిస్తున్న గాడ్జెట్స్‌ను తేవాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా.. ఐటీడీపీతో తమకు సంబంధం లేదన్న విజయ్ తరపు లాయర్ వాదించారు. సీఐడీ నోటీసులో పేర్కొన్న కొన్ని అంశాలపై హైకోర్టు అభ్యంతరం తెలుపుతూ విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2022-10-27T17:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising