ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Undavalli Arunkumar: జగన్‌కు తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టే: ఉండవల్లి

ABN, First Publish Date - 2022-12-07T15:02:34+05:30

తూ.గో.: అమరావతితో పాటు ఏపీ (AP) విభజనపై.. సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arunkumar) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో.: అమరావతితో పాటు ఏపీ (AP) విభజనపై.. సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arunkumar) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ విభజనపై తనతో పాటు మరో 22 మంది పిటిషన్లు దాఖలు చేశారన్నారు. రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని.. ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) సుప్రీంకోర్టులో చెప్పారన్నారు. ఇదంతా సీఎం జగన్‌ (CM Jagan)కు తెలిసే జరుగుతుందా? లేఖ తెలియకుండా జరుగుతుందా? అన్నారు. జగన్‌కు తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టేనని అన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని ఉండవల్లి అన్నారు. లగడపాటి రాజగోపాల్ (Lagadapati Rajagopal) పార్లమెంట్‌ (Parliament)లో పెప్పర్ స్ప్రే కొట్టినప్పుడు.. విభజనకు వ్యతిరేకమని.. విభజన జరగనివ్వమని జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు. పార్లమెంట్ బహిష్కరించిన 16 మందిలో జగన్ కూడా ఉన్నారని ఉండవల్లి పేర్కొన్నారు.

వాదనలు పూర్తి కావడంతో 22 ఫిబ్రవరి 2023 లోపు కౌంటర్ వేయాలని.. కేంద్ర ప్రభుత్వ లాయర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఉండవల్లి తెలిపారు. ఎనిమిదేళ్లు గడిచినా ఏపీ విభజనపై కేంద్రం కౌంటర్ వేయలేదన్నారు. ఏపీ విభజన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని, ఏపీ విభజన సరైనదా? కాదా? నిర్ణయించాలని సుప్రీంకోర్టును కోరుతున్నానన్నారు. తెలంగాణ, ఏపీని ఇప్పుడు కలపాలన్నది తన ఆలోచన కాదని... విభజనలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం తరపున జగన్ సుప్రీంకోర్టుకు తెలియజేయాలన్నారు. దీనిపై జగన్ మాట్లాడకపోతే ఆయనకు ఇక రాజకీయ భవిష్యత్ లేనట్టేనని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు.

Updated Date - 2022-12-07T15:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising