ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Undavalli: జగన్ తప్పులు రోజూ పత్రికల్లో వస్తున్నాయి

ABN, First Publish Date - 2022-11-19T15:16:32+05:30

మార్గదర్శి నిబంధనలు అతిక్రమించినట్టు తన వద్ద ఆధారాలున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మార్గదర్శి కేసు(Maragadarsi Case)పై ఏపీ

రోజూ పత్రికల్లో వస్తున్నాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: మార్గదర్శి నిబంధనలు అతిక్రమించినట్టు తన వద్ద ఆధారాలున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మార్గదర్శి కేసు(Maragadarsi Case)పై ఏపీ ప్రభుత్వానికి ఆధారాలు ఇస్తా. ప్రభుత్వం నన్ను సంప్రదించలేదు. మార్గదర్శిపై సమాచార హక్కు చట్టం ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేశాను. ఇప్పటికీ మార్గదర్శిలో చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. రామోజీరావు(Ramoji Rao)కి పద్మవిభూషణ్ కాదు భారతరత్న ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం రమ్మంటే స్వాధీనం చేసుకున్న మార్గదర్శి రికార్డులు నేను చూస్తాను. రామోజీరావులా ప్రభుత్వం కూడా నాలుగు శాతం వడ్డీకి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తుందా?. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అతిపెద్ద చిట్ ఫండ్ కంపెనీ మార్గదర్శి. చిట్ ఫండ్ చట్టాన్ని, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్దంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరిస్తుంది. జగన్ చేసిన తప్పులు రోజూ పత్రికల్లోవస్తున్నాయి. అందువల్లే నేను మాట్లాడటం లేదు’’ అని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-11-19T15:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising