Gidugu Rudraraju: ఏపీలో కాంగ్రెస్సే బెటర్ అని ప్రజలు భావిస్తున్నారు
ABN, First Publish Date - 2022-11-28T15:16:05+05:30
రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్‌కి నష్టం జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీసీసీ పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నా. పీసీసీ అధ్యక్షుడుగా
ఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్‌కి నష్టం జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraju) అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీసీసీ పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నా. పీసీసీ అధ్యక్షుడుగా నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతం కోసం కార్యకర్తగా పనిచేస్తా. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)ను కలుస్తాం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై అధిష్టానం సలహాలు, సూచనలు తీసుకుంటాం. ఏపీలో భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది.కచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. చంద్రబాబు, జగన్ పాలన చూసిన తరువాత కాంగ్రెస్ పార్టీనే మేలు చేయగలదని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అంశాల వారీగా కలిసి వచ్చే వారితో పోరాటం చేస్తాం’’ అని రుద్రరాజు స్పష్టం చేశారు.
Updated Date - 2022-11-28T15:16:07+05:30 IST