ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bapatla Dist.: వివాదంగా మారిన వైసీపీ కార్యాలయ నిర్మాణం..

ABN, First Publish Date - 2022-12-19T15:58:31+05:30

బాపట్లలో వైసీపీ కార్యాలయం (YCP Office) నిర్మాణం వివాదాస్పదమైంది. బాపట్లలలో ఆర్టీసీ (RTC) గ్యారేజీ పక్కన ఉన్న 1.45 ఎకరాల స్థలాన్ని వైసీపీకు ఆఫీస్‌కు అధికారులు కేటాయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: బాపట్లలో వైసీపీ కార్యాలయం (YCP Office) నిర్మాణం వివాదాస్పదమైంది. బాపట్లలలో ఆర్టీసీ (RTC) గ్యారేజీ పక్కన ఉన్న 1.45 ఎకరాల స్థలాన్ని వైసీపీ ఆఫీస్‌కు అధికారులు కేటాయించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూమి పూజ చేశారు. దీంతో బాపట్ల ఆర్టీసీ డిపో సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ స్థలంలో ఆఫీస్ ఎలా కడతారని ఆర్టీసీ డీఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం కేటాయించిందని మంత్రులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆర్టీసీ డీఎం పోలీసులు, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. 1990లో తాము ఏపీఐఐసీ నుంచి ఈ భూమిని కొనుగోలు చేశామని, తమ అనుమతి లేకుండా వైసీపీ ఆఫీస్‌కు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-12-19T15:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising