Macherla: పల్నాడు, గుంటూరు జిల్లాల్లో హైటెన్షన్
ABN, First Publish Date - 2022-12-17T08:45:13+05:30
పల్నాడు, గుంటూరు (Palnadu Guntur) జిల్లాల్లో హైటెన్షన్ నెలకొంది. మాచర్ల ఘటనతో టీడీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీస్ పహారా కాస్తున్నారు.
గుంటూరు: పల్నాడు, గుంటూరు (Palnadu Guntur) జిల్లాల్లో హైటెన్షన్ నెలకొంది. మాచర్ల ఘటనతో టీడీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీస్ పహారా కాస్తున్నారు. గుంటూరులోని మాజీమంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anand Babu), మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు ఇళ్ల దగ్గర పోలీసులను మోహరించారు. కీలక నేతల కదలికలపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సత్తెనపల్లి (Sattenapalle)లో టీడీపీ నేత కోడెల శివరామ్ హౌస్ అరెస్ట్ చేశారు. ‘ఛలో మాచర్ల’కు కోడెల పిలుపునిచ్చారు. కోడెల కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. కోడెల కార్యాలయం దగ్గర పోలీసు బందోబస్తు చేశారు.
చోరీలకు తెగబడుతున్న వైసీపీ శ్రేణులు
మాచర్లలో దాడులతో పాటు చోరీలకు వైసీపీ శ్రేణులు తెగబడుతున్నాయి. పావనీ అపార్ట్‌మెంట్‌లో టీడీపీ నేతల ఇళ్లు ధ్వంసం చేశారు. ఓ ఇంట్లో లక్షకు పైగా నగదు, బంగారాన్ని వైసీపీ శ్రేణులు దోచుకెళ్లాయని చెబుతున్నారు. తమ జీవితంలో ఇంతటి దుర్మార్గులను చూడలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మాచర్లలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. గుంపులు గుంపులుగా విడిపోయి కర్రలతో హల్‌చల్ చేశారు. టీడీపీ కార్యకర్తల దుకాణాలు, వాహనాలపై దాడికి దిగారు. రింగు రోడ్డు సెంటర్, రైలు గేటు వద్ద వాహనాలకు నిప్పటించారు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లను చుట్టుముట్టారు. మాచర్లలో బ్రహ్మారెడ్డి తన కార్యాలయంగా, నివాసంగా వాడుకుంటున్న భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
Updated Date - 2022-12-17T08:45:15+05:30 IST