ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ippatam: ఇప్పటంలో వైఎస్‌ రెండో విగ్రహం తొలగింపు

ABN, First Publish Date - 2022-11-09T20:31:03+05:30

ఇళ్ల కూల్చివేత ఘటనతో రాష్ట్రంలో మార్మోగుతున్న గుంటూరు (Guntur) జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం (Ippatam) గ్రామంలో వివాదంగా మారిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను బుధవారం తొలగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి: ఇళ్ల కూల్చివేత ఘటనతో రాష్ట్రంలో మార్మోగుతున్న గుంటూరు (Guntur) జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం (Ippatam) గ్రామంలో వివాదంగా మారిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను బుధవారం తొలగించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) బుధవారం సాయంత్రం ఇప్పటం బాధితుల పరామర్శ కోసం గ్రామానికి రానున్న సమాచారంతో గ్రామ వైసీపీ నాయకులు ఉదయమే వైఎస్‌ రెండో విగ్రహాన్ని తొలగించి భద్రపరిచారు. ఇప్పటంలో గత శుక్రవారం మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ అధికారులు పోలీసు పహారాల మధ్య 53 గృహాలకు నష్టం కలిగిస్తూ కూల్చివేయించిన సంగతి తెలిసిందే. ఇళ్ల కూల్చివేతతోపాటు రహదారి వెంబడి ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించిన అధికారులు రహదారిని ఆక్రమించినట్టున్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) రెండు విగ్రహాల జోలికి మాత్రం వెళ్లకపోవడం వివాదాస్పదంగా మారింది.

ఈ క్రమంలో 7న ఒకదానిని గ్రామ వైసీపీ (YCP) నాయకులు తొలగించారు. రెండో ప్రధాన విగ్రహాన్ని గురించి కోర్టు నిర్ణయం వెలువడ్డాక ఆలోచిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో లోకేశ్‌ పర్యటన నేపథ్యంలో ఆయన రాకకు ముందే వైసీపీ నాయకులు రెండో ప్రధాన విగ్రహాన్ని కూడా తొలగించివేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా రెండో వైఎస్సార్‌ విగ్రహాన్ని స్వచ్ఛందంగా తొలగించామని తాడేపల్లి మండల వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు మున్నంగి వివేకానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రోడ్ల విస్తరణకు వైఎస్‌ విగ్రహమైనా, ఎన్టీఆర్‌ విగ్రహమైనా ఆటంకమైతే వాటిని తొలగించక తప్పదన్నారు. అవసరమని భావిస్తే గ్రామస్తులందరం కూర్చొని మాట్లాడుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆలయాలను కూడా తొలగించుకుంటామన్నారు. అంతే తప్ప తాము ఎవరికో భయపడి విగ్రహాన్ని తొలగించలేదన్నారు.

Updated Date - 2022-11-09T20:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising