Palnadu Dist.: షేక్ ఇబ్రహీం కేసును ఛేదించిన పోలీసులు
ABN, First Publish Date - 2022-12-23T13:09:21+05:30
నరసరావుపేటలో ఇటీవల హత్యకు గురైన షేక్ ఇబ్రహీం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు మళ్ళాల బాలాజీ, వరవకట్ట బాబులను పోలీసులు అరెస్టు చేశారు.
పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఇటీవల హత్యకు గురైన షేక్ ఇబ్రహీం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు మళ్ళాల బాలాజీ, వరవకట్ట బాబులను పోలీసులు అరెస్టు చేశారు. జామీయా మసీద్ విషయంలో వివాదాలే ఈ హత్యకు కారణంగా పోలీసులు నిర్ధారించారు. 20న ఓ పథకం ప్రకారం షేక్ ఇబ్రహీం, షేక్ రహమత్ అలీపై మళ్లలా బాలాజీ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో షేక్ ఇబ్రహీం అక్కడికక్కడే మృతి చెందగా.. షేక్ రహమత్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి తెలిపారు.
Updated Date - 2022-12-23T13:09:25+05:30 IST